అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్సా మరో సంచలనం : రాజధాని పైన తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం :పవన్ పైనా..!!

|
Google Oneindia TeluguNews

రాజధాని పైన గతంలో చేసిన వ్యాఖ్యల రగడ ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే మంత్రి బొత్సా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వంలో మంత్రిగా తాను చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా అని బొత్సా ప్రశ్నించారు. అమరావతికి ఒక అడ్రస్ లేకుండా చంద్రబాబు చేశారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మీద బొత్సా మండిపడ్డారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని గతంలో పవన్ చెప్పారా లేదా అని ప్రశ్నించారు.
ఎలా పనిచేయాలో పవన్ చెప్పనక్కరలేదు. మీలాగా నాకు నటించడం రాదు అంటూ చురకలు అంటించారు.

రాజధాని పైన బొత్సా మరోసారి సంచలన వ్యాఖ్యలు..
రాజధాని అమరావతి పైన మంత్రి బొత్సా సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా. నాకు ఉన్న సమాచారం ప్రకారం అలా జరుగలేదు. ఏదైనా ఒక చట్టం చేశారంటే దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అమరావతిలో తాత్కాలికంగా భవనాలు కట్టినట్లే అమరావతిని తాత్కాలిక రాజధానిగా చంద్రబాబు పెట్టారు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతికి ఒక అడ్రస్ లేకుండా చంద్రబాబు చేశారని... అమరావతిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. ఖచ్చితంగా ప్రభుత్వం రాజధాని పైన నిర్ణయం తీసుకుంటుందని.. మంత్రిగా తాను ప్రభుత్వంలోని అంశాలనే చెబుతున్నానని వివరించారు. దీంతో..ఇప్పుడు బొత్సా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, దీని పైన టీడీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇప్పుడు అదే అమరావతిలో మంత్రులు ఎలా పని చేస్తున్నారని ప్రశ్నించారు.

Minister Botsa once again key comments on capital Amaravati

పవన్ పైనా సీరియస్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా బొత్సా సీరియస్ అయ్యారు. తన మీద చేసిన కామెంట్లకు సమాధానంగా రియాక్ట్ అయ్యారు.పవన్ కల్యాణ్ గతంలో రాజధానికి ఐదు వేల ఎకరాలు సరిపోతాయని చెప్పారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని గతంలో పవన్ చెప్పారా లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రులు ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో పవన్ చెప్పనక్కరలేదని..పవన్ లాగా తనకుకు నటించడం రాదంటూ పవన్‌ కల్యాణ్‌ తీరును దుయ్యబట్టారు. తుగ్లక్ పాలన అంటే చంద్రబాబు నాయుడిదే అనే విషయం లోకేశ్‌ తెలుసుకోవాలని పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. తుగ్లక్ అంటే ఎవరో అసలు లోకేశ్‌కు తెలుసా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నుంచి మూటా- ముల్లె సర్దుకుని చంద్రబాబు పారిపోయివచ్చిన విషయం లోకేశ్‌ మర్చిపోయాడా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనపై విమర్శలు గుప్పిస్తున్న లోకేశ్‌ తీరును బొత్స ఎండగట్టారు. చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని... ఇప్పుడు శాంతియుత పాలన సాగుతుంటే పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస కేంద్రాలను పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మరుని బొత్సా దుయ్య బట్టారు.

English summary
Minister Botsa once again key comments on capital Amaravati. He says govt take important decision on Capital. Botsa seriously reacted on Pawan Kalyn comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X