వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ నోటీసులపై స్పందించిన మంత్రి బొత్సా ... ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

వోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ కోర్టు నోటీసులపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తన స్పందన తెలియజేశారు. వోక్స్ వ్యాగన్ కేసులో తాను సాక్షిని మాత్రమేనని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కేసులో తాను 60వ సాక్షిగా మాత్రమే సీబీఐ పిలిచిందని క్లారిటీ ఇచ్చారు. ఇక తాను విచారణకు హాజరవుతానని తెలిపారు మంత్రి బొత్స. ఈ కేసులో తన సాక్షి మాత్రమే అని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు నోరు లేకుండా చేసారు బొత్స సత్యనారాయణ. లేకుంటే వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణను ముడిపెట్టి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు పలు విమర్శలు చేయడానికి సిద్ధమై పోయాయి. అందుకే ఈ కేసులో తను నిందితుడిని కాదని కేవలం సాక్షి మాత్రమేనని బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.వోక్స్ వ్యాగన్ కేసులో సిబిఐ ముందు హాజరు కావాలని ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు నోటీసులు పంపారు. సెప్టెంబర్ 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో 2005లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వోక్స్ వ్యాగన్ కేసు. వోక్స్ వ్యాగన్ కేసులో అవినీతి చోటు చేసుకొందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆనాటి వైయస్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకు అప్పగించింది.

Minister Botsa responds to CBI notices in the Vox Wagon case

వోక్స్ వ్యాగన్ కేసులో సుమారు రూ. 12 కోట్ల రూపాయాల అవినీతి చోటు చేసుకొందని సీబీఐ గుర్తించగా ఇప్పటికే సుమారు రూ. 7 కోట్లను రికవరీ చేశారు. మరో రూ. ఐదు కోట్లను రికవరీ చేయాల్సి ఉంది. ఈ కేసు విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ విచారణను ముమ్మురం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే 3వేల పేజీల చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. 59 సాక్షులను విచారించింది. 60వ సాక్షిగా ఉన్న అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి, నేటి పురపాలక శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణకు నోటీసులు అందజేసింది సి.బి.ఐ.

<strong>చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్..ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లో 6 వేలకు పైగా ఇళ్ళ రద్దు జీవో జారీ</strong>చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చిన జగన్..ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లో 6 వేలకు పైగా ఇళ్ళ రద్దు జీవో జారీ

English summary
AP Minister Botsa Satyanarayana has responded to CBI court notices in the Vox Wagon case. Minister Botsa Satyanarayana, who said he was only a witness in the Vox Wagon case, said that he had called the CBI as the 60th witness in the case. Minister Botsa said he would attend the hearing.Botsa Satyanarayana has shut the mouths of opposition parties saying that he was his witness in this case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X