వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా అయితే లోకేష్ అరెస్ట్ కూడా తప్పదు... మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడును అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు అంటున్నారని... కానీ అవినీతి జరగలేదని మాత్రం చెప్పలేకపోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లేఖలు తాను కూడా ఇచ్చానని లోకేష్ అంటున్నారని... ఒకవేళ ఆయన కూడా తప్పుడు లేఖలు ఇచ్చి ఉంటే అరెస్ట్ తప్పదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన చూసి టీడీపీ అధినేత చంద్రబాబుకు కడుపు మండుతోందని విమర్శించారు. పేదలకు మేలు చేస్తున్న మంచి పనులను అడ్డుకుంటే దేవుడు కూడా క్షమించడని మండిపడ్డారు.

108,104 వాహనాలు రేపే ప్రారంభం...

108,104 వాహనాలు రేపే ప్రారంభం...

అత్యున్నత ప్రమాణాలు,అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం,వసతులతో కూడిన 108,104 సర్వీసులను బుధవారం(జూలై 1) సీఎం జగన్ ప్రారంభించనున్నారని మంత్రి బొత్స అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 108,104 వాహనాలు చంద్రబాబు హయాంలో మూలన పడ్డాయన్నారు. వాహనాల కొనుగోలు కోసం రూ.200 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని... కానీ టీడీపీ మాత్రం రూ.300 కోట్లు అవినీతి జరగిందనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎప్పుడైనా ప్రజలకు మంచి చేసే పనులు చేపట్టారా అని ప్రశ్నించారు.

కరోనా నియంత్రణలో భేష్..

కరోనా నియంత్రణలో భేష్..


కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని... సోమవారం(జూన్ 29) ఒక్కరోజే 30వేల టెస్టులు చేసిందని బొత్స అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని టెస్టులు ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నామన్నారు. గత టీడీపీ పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపారని బొత్స ఆరోపించారు. పారిశ్రామిక ప్రోత్సహాలను కూడా ఎగ్గొట్టారని ఆరోపించారు. ఏ రంగాన్ని పట్టించుకోలేదన్నారు. అమర్ రాజా కంపెనీ భూములు వెనక్కి తీసుకోవడంపై స్పందిస్తూ... భూములు ఇచ్చిన తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకోకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు.

Recommended Video

Happy Birthday Vijay: వీడు HERO ఏంటి అన్నారు..కానీ అతనే ఇప్పుడు SOUTH TOP HERO | Oneindia Telugu
పోలవరంలో అవినీతి...

పోలవరంలో అవినీతి...

పోలవరంను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకుంటున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే పేర్కొన్నారని బొత్స గుర్తుచేశారు. ప్రధాని చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ జయంతి రోజున 30లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని... పేదలకు మేలు చేస్తున్న మంచి పనులు అడ్డుకుంటే దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ల్యాండ్ పూలింగ్ పద్దతిలోనే వైజాగ్‌లో భూ సమీకరణ చేస్తున్నామన్నారు. ఇందులో ఎక్కడా అవినీతికి తావు లేదన్నారు.

English summary
Minister Botsa Satyanarayana criticised TDP chief Chandrababu Naidu and MLC Nara Lokesh for making allegations against YS Jagan government. He said YSRCP government is always thinks about the people and their welfare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X