India
  • search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘కాళ్లకు జేసీ నమస్కారం’పై బొత్స సత్యనారాయణ స్పందన: టీడీపీ నుంచి సీపీఐ దాకా ఏకిపారేశారు

|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ న్యూఇయర్ సందర్భంగా ఒంగి తనకు నమస్కారం పెట్టడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అది పెద్ద చిన్నా తారతమ్య సంస్కారానికి సబంధించిన అంశమని అన్నారు. ఆయనేమీ తనకు సాష్టాంగం చేయలేదు, కాళ్లు పట్టుకోలేదని స్పష్టం చేశారు.

వంగి నమస్కరించడం మన సంప్రదాయమన్న బొత్స

వంగి నమస్కరించడం మన సంప్రదాయమన్న బొత్స

వయసులో 20 ఏళ్ల పెద్ద వాళ్ళు కనిపించినపుడు వంగి నమస్కరించడం మన సంప్రదాయమని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స సత్యనారాయణ. సాంప్రదాయాలను కూడా వక్రీకరించి విమర్శలు చేయడం సరైంది కాదని మంత్రి హితవు పలికారు. హయగ్రీవ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో తప్పు చేస్తే తరతమ భేదం ఉండదు. వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులతో మాట్లాడానని తెలిపారు. పేపర్లలో వచ్చిన ఫోటోలకు, సర్క్యూట్ హౌస్‌లో జరిగిన దానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు మంత్రి బొత్స.

ఏపీ కాపు నేతలపై సమావేశంపై మంత్రి బొత్స

ఏపీ కాపు నేతలపై సమావేశంపై మంత్రి బొత్స


ఇక, హైదరాబాద్‌లో జరిగిన ఏపీ కాపు నాయకుల సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత లేదన్నారు మంత్రి బొత్స. ఓ వివాహం కోసం వెళ్లే ముందు హోటల్లో కాఫీ తాగుతూ మాట్లాడుకున్న మాటలు అవి. ఆ సమావేశానికి నన్ను పిలిచారు. మరో సమావేశం జరిగిన విషయం గురించి నాకు తెలియదు. కడుపు మంటతో ఉన్న వాళ్ళు కలిసి మాట్లాడుకుంటే దానికి మాకు ఏం సంబంధం. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా వున్నాయన్నారు బొత్స. తన ఇంటిపై రెక్కీ జరిగిందని రాధానే చెప్పాడు... దానిపై డీజీపీ కూడా స్పందించారు. నిర్ణయాలు చెప్పడానికి చంద్రబాబు ఏమైనా అంబుడ్స్ మెన్నా' అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

టీడీపీ నుంచి సీపీఐ దాకా ఏకిపారేసిన మంత్రి బొత్స

టీడీపీ నుంచి సీపీఐ దాకా ఏకిపారేసిన మంత్రి బొత్స


ఏపీలో పేదలకు కడుతున్న ఇళ్ళపై అవినీతి ఆరోపణలు చేసిన సీపీఐ రామకృష్ణకు మంత్రి బొత్స కౌంటరిచ్చారు. పిచ్చుక గుళ్ళు లాంటి ఇళ్లు కడుతున్నారని విమర్శిస్తున్నారు.. పేదలకు ఇళ్ళు ఇస్తే మీకెందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా ఇంతకంటే పెద్ద ఇళ్లు కట్టారా? అని ప్రశ్నించారు మంత్రి బొత్స. సిద్దాంతాల గురించి మాట్లాడే బీజేపీ, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వస్తారు. వీళ్ళ మధ్యలో టీడీపీ. దాని వెనుక తోకపార్టీ జనసేన నడుస్తున్నాయని బొత్స విమర్శించారు. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఏమైనా చీఫ్ ఎలక్షన్ కమిషనరా...? అని, బీజేపీకి అడ్వైజరా...? అని ప్రశ్నించారు. జిన్నాటవర్, కేజీహెచ్ పేర్లు మార్చాలనే బీజేపీవి చీప్ ట్రిక్స్. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనిని ఇప్పుడు తెరపైకి తేవడం దురుద్దేశ పూరితం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు మంత్రి బొత్స. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. రూ. 4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు.

English summary
minister Botsa Satyanarayana responded on Joint Collector issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X