వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌండ్ లేదు.. ఇక చంద్రబాబు సబ్జెక్ట్ క్లోజ్.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే ఇప్పటివరకు చంద్రబాబు నుంచి గానీ,లోకేష్ నుంచి గానీ ఇప్పటివరకు సౌండ్ లేదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.
చంద్రబాబు,లోకేష్ ఎక్కడ తలుపులు మూసుకుని కూర్చున్నారోనని వారి సెక్యూరిటీ కూడా వెతుకుతున్నారని సెటైర్స్ వేశారు. చంద్రబాబు నాయుడు సబ్జెక్ట్ ఇక క్లోజ్ అని.. స్వర్గీయ ఎన్టీఆర్ పుణ్యమాని ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగాడని, కానీ ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదని సూచించారు.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Pollution Free Hyderabad | Nithyananda
 చంద్రబాబు అవినీతి తేటతెల్లం..

చంద్రబాబు అవినీతి తేటతెల్లం..

అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా కాకుండా.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌గా మార్చేశారని మంత్రి బొత్స అన్నారు. చంద్రబాబు అవినీతి అక్రమాలపై తాము ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నామని.. అందుకు తమను అభివృద్ది నిరోధకులు అని ఆరోపించారని గుర్తుచేశారు. అయితే తమకు కావాల్సింది అభివృద్ది అని,అవినీతి కాదని ఎన్నోసార్లు స్పష్టం చేశామన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక రూ.100కోట్లు దాటిన ప్రతీ ప్రాజెక్టుపై దర్యాప్తు జరుపుతామని చెప్పామన్నారు. ఈరోజు ఆయన పీఏ ఇంటిపై జరిగిన సోదాల్లో బయటపడ్డ అక్రమాలను చూస్తుంటే.. చంద్రబాబు అవినీతి తేటతెల్లం అవుతోందని అన్నారు. ఒకవేళ చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయకపోతే.. ఎందుకు బయటకు వచ్చి వీటన్నింటిని ఖండించట్లేదని ప్రశ్నించారు.

ఆఖరికి పేదల ఇళ్ల నిధులను కూడా దోచుకున్నారు..

ఆఖరికి హడ్కా గృహ నిర్మాణం కింద పేదలకు ఇచ్చే ఇళ్లకు సంబంధించి కూడా భారీగా అవినీతి చేశారని బొత్స ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 63474 ఇళ్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే.. రూ.392 కోట్లు ఆదా అయిందన్నారు. అంటే,పేదలకు సంబంధించిన వందల కోట్ల రూపాయాలను కూడా కాజేశారని ఆరోపించారు. త్వరలోనే మరో 70వేల ఇళ్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించబోతున్నామని.. మరో రూ.400 కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నామని చెప్పారు.

డొల్ల కంపెనీలు టీడీపీ నేతలవే..

డొల్ల కంపెనీలు టీడీపీ నేతలవే..

గతంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన కుటుంబరావు అనే వ్యక్తి.. ప్రతీ దానికి మీడియా ముందుకు వచ్చేవారని,ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదని బొత్స అన్నారు. దోపిడీకి సంబంధించి ఈ లెక్కల ప్రణాళికలన్నీ వేసింది ఆయనేనని ఎద్దేవా చేశారు. పీఏ ఇంటిపై సోదాల్లో బయటపడ్డ డొల్ల కంపెనీలు టీడీపీ నేతలకే చెందినవని తేలిందన్నారు. అందులో ఒకరు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాగా,మరొకరు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అబ్బాయి,నారా లోకేష్ బినామీ రాజేష్ అని తేలిందన్నారు.

కిక్కురుమనట్లేదు..

కిక్కురుమనట్లేదు..

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు ధిట్ట అని.. కానీ అవినీతి అక్రమాలు ఏదో రోజు బహిర్గతం అవుతాయని బొత్స అన్నారు. తనపై గతంలో అవినీతి ఆరోపణలు వస్తే చాలా హడావుడి చేశారని.. టీడీపీ నేతలు,చంద్రబాబు ఇప్పుడెందుకు కిక్కురుమనకుండా ఉన్నారని ప్రశ్నించారు. నిప్పు లేకుండా పొగ రాదని.. చంద్రబాబు రాష్ట్ర ఖజానాకు సంబంధించిన డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని.. అప్పట్లోనే కథనాలు వచ్చాయని అన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. చంద్రబాబు కడిగి ముత్యమో.. మసిబొగ్గో త్వరలోనే తేలుతుందన్నారు.

English summary
Minister Botsa Satyanarayana has said that there is no sound from Chandrababu Naidu or Lokesh so far as IT raids have taken over the house of TDP chief Chandrababu Naidu's former PA Srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X