వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ ప్రాంతంలో ఏం పండుతుందో చెప్పాలని లోకేష్ కు బొత్సా సవాల్ ... లోకేష్ సీరియస్

|
Google Oneindia TeluguNews

నేడు తొలిరోజు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్ ను టార్గెట్ చేసి మాటల తూటాలు పేల్చారు. ఇక లోకేష్ మంత్రి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు . వారిద్దరి మధ్య కొనసాగిన రగడ రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది .

మండలిలో చంద్రబాబు 'మనసులోమాట' రచ్చ .... ముగ్గురు మంత్రుల మూకుమ్మడి దాడిమండలిలో చంద్రబాబు 'మనసులోమాట' రచ్చ .... ముగ్గురు మంత్రుల మూకుమ్మడి దాడి

 లోకేష్ ఎక్కడ ఏ పంట పండుతుందో చెబితే తాను తలదించుకుని కూర్చుంటానని బొత్సా సవాల్

లోకేష్ ఎక్కడ ఏ పంట పండుతుందో చెబితే తాను తలదించుకుని కూర్చుంటానని బొత్సా సవాల్

లోకేష్ పై నిప్పులు చెరిగిన బొత్ససత్యనారాయణ టిడిపి ఎమ్మెల్సీ లోకేష్ ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో తెలియని వ్యక్తని ఇక ఆయన కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. లోకేష్ ఎక్కడ ఏ పంట పండుతుందో చెబితే తాను తలదించుకుని కూర్చుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. వ్యవసాయం మీద ఏ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు బొత్స సత్యనారాయణ.

 ట్రాక్టర్ ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం కాదని ఫైర్ .. చంద్రబాబుపై కూడా మండిపాటు

ట్రాక్టర్ ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం కాదని ఫైర్ .. చంద్రబాబుపై కూడా మండిపాటు

ట్రాక్టర్ ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదని ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ. రైతుల ట్రాక్టర్ ను బురదగుంటలోకి పోయేలా చేయడం తప్ప లోకేష్ కి ఏం తెలుసు మండిపడ్డారు. ట్రాక్టర్ ను బురదలోకి దింపి దాన్ని రైతులతో బయటికి తీయించుకున్న వ్యక్తి లోకేష్ అని ఫైర్ అయ్యారు బొత్స సత్యనారాయణ. చంద్రబాబునాయుడు వ్యవసాయం గురించి మనసులో మాట అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాసుకున్నారని, లోకేష్ ఆ పుస్తకం తెస్తే చంద్రబాబు ఏమన్నారో చూపిస్తామన్నారు బొత్స సత్యనారాయణ.

Recommended Video

#PerniNani : మంత్రి Perni Naniపై దుండగుడి దాడి.. కాళ్లకు దండం పెట్టడానికి వచ్చి పదునైన తాపీతో..!
 సభలో లేని వారిపై మాట్లాడటం సభ్యత కాదు .. ఆధారాలు చూపించాలని లోకేష్ సీరియస్

సభలో లేని వారిపై మాట్లాడటం సభ్యత కాదు .. ఆధారాలు చూపించాలని లోకేష్ సీరియస్

బొత్స వ్యాఖ్యలపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఎప్పుడు, ఎక్కడ వ్యవసాయం దండగ అని చెప్పాడో చూపించాలని సవాల్ చేశారు. ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. లేదంటే బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సభ్యత కాదని మంత్రికి సూచించిన నారా లోకేష్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సభలో ప్రస్తుతం మాట్లాడుతున్న అంశంపై కాకుండా వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని లోకేష్ మంత్రి బొత్స సత్యనారాయణపై విరుచుకుపడ్డారు.

English summary
The war of words between the ruling opposition parties continued in the Andhra Pradesh Legislative council during the early winter sessions today. In particular, Municipal Minister Botsa Satyanarayana targeted TDP national general secretary MLC Lokesh and fired . Lokesh became serious about the minister's remarks over him and chandrababu. The ongoing feud between the two has become a topic of discussion in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X