వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ: కీలక అంశాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. బుగ్గన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను త్వరగా ఇవ్వాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను సరిచేస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్రమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వంలో తప్పుడు ఒప్పంాలు జరిగినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇళ్లు లేని పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వారికి పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

minister buggana rajendranath meets nirmala sitharaman over polavaram and funds

అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో బుగ్గన భేటీ అయ్యారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి ఇండియో కమర్షియల్ ఆపరేషన్‌లపై చర్చించారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.

హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయడం ప్రజలు, ఫ్రంట్ లైన్ వారియర్ల విజయమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. హైకోర్టు ధర్మాసనం తీర్పుతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలను స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. ఆర్టికల్ 14, 21కి విరుద్ధంగా ఎన్నికల షెడ్యూల్ ఉందన్నారు.

English summary
minister buggana rajendranath meets nirmala sitharaman over polavaram and funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X