వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రూ.500, రూ.1000 నోట్ల ఎఫెక్ట్, 'తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరిన జగన్'

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భూగర్భంలో దాచుకున్న తన నల్ల డబ్బు ఏమవుతుందోనని నల్ల కుబేరుడు, వైసిపి నేత జగన్ తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరాడని ఎద్దేవా చేశారు.

పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకోని జగన్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

'మా వద్ద సమాచారం మేరకు.. జగన్ బిల్డింగ్‌లోని నేలమాళిగలో బ్లాక్‌మనీ' 'మా వద్ద సమాచారం మేరకు.. జగన్ బిల్డింగ్‌లోని నేలమాళిగలో బ్లాక్‌మనీ'

devineni umamaheswara rao

పదహారు నెలల పాటు జైలులో ఉన్న జగన్‌ ఆస్తులను రూ. 43 వేల కోట్లను ఈడీ జప్తు చేస్తే సిగ్గు లేకుండా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రాభివృద్దికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తనను, టిడిపి నేతలను వారి సాక్షి ఛానల్‌, పత్రికల్లో తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆ పార్టీ నేతలకు కూడా అదే పని అన్నారు. ఆ పార్టీ నేతలతో తిట్టించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి దుయ్యబట్టారు.

ys jagan

రేపు శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా టిడిపి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం చేరుకొని.. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్లి నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు.

అక్కడి నుంచి ముత్యాలమ్మకోవెల జంక్షన్‌కు చేరుకొని జనచైతన్య యాత్రలో భాగంగా రెండు కి.మీ. పాదయాత్ర చేస్తారన్నారు. అనంతరం ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.

భోజనానంతరం కోడి రామ్మూర్తి స్టేడియంకు చేరుకొని డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌కు వెళ్తారని తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

English summary
Minister Devineni Umamaheswara Rao on Friday said that YSRCP chief YS Jagan in hospital after old currency ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X