వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాల పర్వం: ఏరాసు గుడ్‌బై, రేపు కిరణ్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవికి ఏరాసు ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు. సోమవారం ఆయన గవర్నర్ నరసింహన్‌కు ఫ్యాక్స్ చేశారు. తాను ఇష్టపూర్తిగా రాజీనామా చేసినట్లు ఆయన అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆయన రాజీనామా చేశారు.

అంతకుముందు ఏరాసు ముఖ్యమంత్రితే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిరణ్ రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రి బుధవారం ఉదయం పదకొండుగంటలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.

Minister Erasu Pratap Reddy resigns

అదే దారిలో టిజి వెంకటేష్

కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ కూడా ఏరాసు ప్రతాప్ రెడ్డి దారిలో నడిచే అవకాశాలున్నాయి. ఆయన మరికొద్దిసేపట్లో రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాస్ కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

English summary
Cabinet minister in CM Kiran kumar Reddy's ministry, Erasu Pratap Reddy has resigned from his post and Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X