అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఫై నగరంగా విశాఖ, 'బాబు తగిన మూల్యం చెల్లించక తప్పదు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: దేశంలో ఏపీ తొలి డిజిటల్ రాష్ట్రంగా అవతరించిందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖలోని స్ధానిక రుషికొండ ఐటీ పార్కులో సోమవారం ఆయన 5జీ వై-ఫై సేవలను, స్టార్టప్‌ విలేజ్‌కి 1 జీబీపీఎస్‌ బ్యాండ్‌ విడ్త్‌ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌-క్వాడ్‌జెన్‌ సంయుక్తంగా అందిస్తున్న 5జీ వై-ఫై సేవలు తొలుత కైలాసగిరి, ఉడా పార్కు, ఆర్‌కే బీచ్‌ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఆ తర్వాత నగరమంతా విస్తరిస్తామని చెప్పారు.

ఈ నెట్‌వర్క్‌ 2 ఎంబీపీఎస్ నుంచి 20 వేగంతో పనిచేస్తుందన్నారు. స్టార్టప్‌ విలేజ్‌కి 1 జీబీపీఎస్‌ బ్యాండ్‌ విడ్త్‌ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ఎయిర్‌టెల్‌ అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల ప్రధానఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని, వాటితో సమాచారం తెలుస్తుందని అన్నారు.

తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

దేశంలో ఏపీ తొలి డిజిటల్ రాష్ట్రంగా అవతరించిందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖలోని స్ధానిక రుషికొండ ఐటీ పార్కులో సోమవారం ఆయన 5జీ వై-ఫై సేవలను, స్టార్టప్‌ విలేజ్‌కి 1 జీబీపీఎస్‌ బ్యాండ్‌ విడ్త్‌ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ప్రారంభించారు.

తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌-క్వాడ్‌జెన్‌ సంయుక్తంగా అందిస్తున్న 5జీ వై-ఫై సేవలు తొలుత కైలాసగిరి, ఉడా పార్కు, ఆర్‌కే బీచ్‌ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఆ తర్వాత నగరమంతా విస్తరిస్తామని చెప్పారు.

తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

ఈ నెట్‌వర్క్‌ 2 ఎంబీపీఎస్ నుంచి 20 వేగంతో పనిచేస్తుందన్నారు. స్టార్టప్‌ విలేజ్‌కి 1 జీబీపీఎస్‌ బ్యాండ్‌ విడ్త్‌ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ఎయిర్‌టెల్‌ అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల ప్రధానఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందిస్తున్నామని, వాటితో సమాచారం తెలుస్తుందని అన్నారు.
తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

ప్రతి ఇంజనీరింగ్ కళాశాల ఒక స్టార్టప్ విలేజ్‌గా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి సమక్షంలో ఐటీ సంస్ధలు ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

 తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

తొలి డిజిటల్ రాష్ట్రంగా ఏపీ

స్టార్టప్ ప్రాజెక్టులో భాగస్వాములను చేసినందుకు సంతోషంగా ఉందని ఇంటెల్ ప్రతినిధి శ్రుతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సత్యనాయణ, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి ఏయూ వైస్ ఛాన్సలర్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగేతర శక్తుల్ని సీఎం పోషిస్తున్నారు: సీఆర్

సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాగేతర శక్తుల్ని పెంచి పోషిస్తున్నారని ఏపీ శాసనమండలి కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంతో సంబంధం లేని పరకాల ప్రభాకర్ మంత్రివర్గ సమావేశాల్లో ఎలా పాల్గొంటారని మండిపడ్డారు.

ప్రభుత్వ అధికారులను పరకాల ప్రభాకర్‌, లోకేశ్‌లు ఎలా ప్రభావితం చేస్తున్నారని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాల్సిన ప్రభుత్వం దాన్ని కేవలం టీడీపీ కార్యకర్తల పండుగగా మార్చేసిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేనట్టుగా భావిస్తున్నారని దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

English summary
Minister ganta says AP will be the first digital state in country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X