వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రం పవన్‌ జాగీరు కాదు...మతిభ్రమించి ఆ మాటలు:మంత్రి జవహర్;నేడు జనసేన అంతర్మథనం

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి:మళ్లీ టిడిపిని అధికారంలోకి రానిచ్చేది లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జవహర్ ఘాటుగా ప్రతిస్పందించారు.

పశ్చిమగోదావరి జిల్లా బోడపాడులో గురువారం నిర్వహించిన గ్రామదర్శినిలో మంత్రి జవహర్ మాట్లాడుతూ...''వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా చేస్తానని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. టీడీపీని లేకుండా చేయడానికి రాష్ట్రం ఆయన జాగీరు కాదు''...అని మండిపడ్డారు. పవన్‌ ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ప్రచారం సాగిస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

ప్రజారాజ్యంలో...పవన్ కళ్యాణ్

ప్రజారాజ్యంలో...పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఆయన యువజన నాయకునిగా ఉండేవారని మంత్రి జవహర్ గుర్తుచేశారు. నాటి పార్టీ ప్రచారంలో నాయకులని పంచెలూడదీసి పరిగెత్తిస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి జవహర్ ప్రస్తావించారు. అలా మాట్లాడిన వాళ్లు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు ప్రజారాజ్యం పార్టీని అమ్మేశారంటూ విమర్శించారు.

Recommended Video

టిడిపి ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ చతురులు
పవన్ కు...మతిభ్రమించింది

పవన్ కు...మతిభ్రమించింది

పవన్‌ కళ్యాణ్ కు మతిభ్రమించి ఇలా మాట్లాడుతున్నారని మంత్రి జవహర్ మండిపడ్డారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం గూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావుకు మళ్లీ కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలిచే పరిస్థితి లేదని, టీడీపీ మద్దతుతోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారని మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు.

జనసేన...అంతర్మథనం

జనసేన...అంతర్మథనం

ఇదిలావుంటే నేను జనసేన తమ పార్టీ కార్యకలాపాలను ఇంకా ఎలా విస్తరించాలి, తమ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంతర్మథనం చేసుకోనుంది. తమ పార్టీ అధినేత పర్యటన పవన్ కళ్యాణ్ పర్యటనల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందనను పార్టీ నిర్మాణానికి ఊతం ఇచ్చేలా ఎలా మలచుకోవాలి వంటి కీలక అంశాలపై నేడు జనసేన పార్టీ లో చర్చ జరగనుందని సమాచారం. స్వయంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోనే ఈ సమావేశం జరగనుందని తెలిసింది.

పరేడ్ పై...తర్జన భర్జనలు

పరేడ్ పై...తర్జన భర్జనలు

అలాగే ఈ నెల 9న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకు రోడ్డు కం రైలు వంతెనపై ఒక భారీ పరేడ్ నిర్వహించాలని జన సేన భావిస్తోంది. విజయవాడ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఇదే విషయంపై సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ కవాతుకు అనుమతులు తీసుకోవాల్సి రావడం, ఇతరత్రా ఏర్పాట్లు పరంగా సమయం సరిపోదనే అభిప్రాయం కొందరు పార్టీ నాయకుల నుంచి వ్యక్తమైందని తెలిసింది. దీంతో ఈ పరేడ్ ను దసరా వెళ్లే వరకు వాయిదా వేయాలని కొందరు సూచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం పై కూడా నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

English summary
West Godavari:Minister Jawahar responded over Jana sena chief Pawan Kalyan remarks about TDP and Chandra babu. Minister Jawahar said that Pawan's comment was meaningless and that it has become a habit for Pawan to crave for money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X