వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కామినేని అసహనం, 'బడ్జెట్‌పై తప్పుడు ప్రచారం'

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: మిత్రపక్షమైన టిడిపిపై తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు.

Recommended Video

TDP leaders Protest BJP MLC's Remarks Against Babu

'బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు''బిజెపితో దోస్తీపై తీవ్ర నిర్ణయం తప్పదు', 'అందుకే కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కలేదు'

పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి అనుమతితో వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారా లేదా అనే విషయం తనకు తెలియదన్నారు.

దుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనందుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనం

ఏపీ రాజకీయాల్లో బిజెపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టిడిపి నేతలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.

' వాస్తవాలు టిడిపి నేతలు తట్టుకోవడం లేదు,వారికి ఎందుకు మంత్రిపదవులిచ్చారు'' వాస్తవాలు టిడిపి నేతలు తట్టుకోవడం లేదు,వారికి ఎందుకు మంత్రిపదవులిచ్చారు'

బిజెపి అధిష్టానం దృష్టికి బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను తీసుకెళ్ళాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యక్తిగత విమర్శలపై టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టిడిపిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు

టిడిపిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు


ఏపీ రాష్ట్రంలో టిడిపి, బిజెపి మిత్రపక్షంగా ఉన్న విషయాన్ని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గుర్తు చేశారు. అయితే మిత్రపక్షంతో విభేదాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని కామినేని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

పార్టీ అధ్యక్షుడి అనుమతి ఉందో లేదో తెలియదు

పార్టీ అధ్యక్షుడి అనుమతి ఉందో లేదో తెలియదు

తాను ఏది మాట్లాడాలనుకోవాలనుకొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి తీసుకొని మాట్లాడుతానని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన విమర్శల విషయమై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు దృష్టిలో ఉందో లేదా తనకు తెలియదన్నారు.

వ్యవస్థ లోపాలు ఎత్తిచూపడంలో తప్పులేదు

వ్యవస్థ లోపాలు ఎత్తిచూపడంలో తప్పులేదు

వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపడంలో తప్పులేదని బిజెపి శాసనసభపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. అయితే సీఎం చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని విష్ణుకుమార్ రాజు చెప్పారు.

బడ్జెట్‌పై తప్పుడు ప్రచారం

బడ్జెట్‌పై తప్పుడు ప్రచారం


కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి శాసనసభపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు చెప్పారు. గతంలో కూడ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడ ఇదే తరహలో ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు.

English summary
Andhra pradesh health minister Kamineni Srinivasa Rao responded on Bjp MLC Somu veerraju comments over Tdp leaders on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X