వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ఎప్పుడైనా చిరంజీవి గురించి చెప్పారా: ఊపులు.. అరుపులకు ఎవరూ భయపడరు : మంత్రి కన్నబాబు..!

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్‌లు వదలడం లేదు.. అదే విధంగా డ్రామాలు చేస్తున్నారు. మట్టి పిడతల్లో ఎవరైనా మజ్జిగ అన్నం తింటారా అని ప్రశ్నించారు. నాగబాబు ద్వారా తనకు చిరంజీవి తో పరిచయం ఏర్పడిందన్నారు. చిరంజీవి టికెట్‌ ఇస్తేనే తాను 2009లో నేను గెల్చాను అని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి రావటానికి కారణం చిరంజీవి అని ఇప్పటికీ చెబుతానని..పవన్ ఏనాడైనా తన అన్నయ్య చిరంజీవి పేరు చెప్పారా అని కన్నబాబు నిలదీసారు. పవన్‌ స్థిరంగా నిలబడి ఎక్కడైనా కనీసం ఒక్క నిమిషం అయినా మాట్లాడగలుగుతారా.. ఆయన ఊపులు, అరుపులకు ఎవరూ భయపడరు అని కన్నబాబు స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్ ను చూసి పవన్ నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.

పవన్ కళ్యాణ్ షో చేసారు..

పవన్ కళ్యాణ్ షో చేసారు..

టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా పవన్‌కళ్యాణ్‌ బయటకు వస్తారని... ఏదో ఒక కార్యక్రమం చేపట్టి.. విమర్శలు గుప్పిస్తారంటూ మంత్రి కన్నబాబు విమర్శించారు. విశాఖలో లాంగ్‌ మార్చ్‌ పేరుతో షో చేశారన్నారు. ఒక్క అడుగు కూడా నడవకుండా వాహనంపై ఊరేగారని ఆరోపించారు. ఇసుక దోపిడి చేసిన వారికి పక్కన పెట్టుకుని మాట్లాడారని.. మంత్రిగా అచ్చెన్నాయుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు కుమారుడు చిరంజీవిపై ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేసారు. అయినా ఆయనను పక్కన పెట్టుకుని పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగించారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో ఏరోజైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గళం ఎత్తారా అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి కోసం గతంలో ‘ఛలో కాకినాడ' చేపట్టినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వారికి ఎందుకు వారికి మద్దతు ఇవ్వలేదని నిలదీసారు. ఇసుక సమస్య మరో 15 రోజుల్లో పరిష్కారం కానుందని... ఈ విషయం తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

సినిమాలు వదిలినా..డైలాగులు మాత్రం

సినిమాలు వదిలినా..డైలాగులు మాత్రం

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్‌లు వదలడం లేదని ఎద్దేవా చేసారు. అదే విధంగా డ్రామాలు చేస్తున్నారని... మట్టి పిడతల్లో ఎవరైనా మజ్జిగ అన్నం తింటారా అని ప్రశ్నించారు. ఇవాళ మారుమూల ప్రాంతాల్లో కూడా డిస్సోజల్స్‌ వాడుతున్నారు.. కానీ పవన్‌కు ఆ మట్టి పిడతలు ఎక్కడ దొరికావో ఎవరికీ తెలియదన్నారు. కారు డిక్కీలో కూర్చుని టీ తాగుతారు. ట్రెయిన్‌లో టాయిలెట్‌ పక్కన కూర్చుని పుస్తకాలు చదువుతారు. వర్షం కురుస్తుంటే గొడుగు వేసుకుని ఆవుకు అరటిపండ్లు పెడతారు అంటూ ఎద్దేవా చేసారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని... ఈ తరహా డ్రామాలు చంద్రబాబు డైరెక్షన్‌లో చేస్తే, వెంటనే వాటిని విడిచి పెట్టండని సూచించారు. జగన్‌ ను చూసి సంస్కారం నేర్చుకోవాలన్నారు. 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెల్చినా ఎంత ఒదిగి ఉంటున్నారో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. .. పవన్‌ కళ్యాణ్‌ 2 లక్షల పుస్తకాలు చదివానంటున్నారు. వాటిలో ఎక్కడైనా వరదల్లో ఇసుక ఎలా తీయాలని ఉంటే చెప్పండి. వెంటనే ప్రయత్నిస్తామని కన్నబాబు సూచించారు.

ఎప్పుడైనా చిరంజీవి పేరు చెప్పారా..

ఎప్పుడైనా చిరంజీవి పేరు చెప్పారా..

పవన్‌ స్థిరంగా నిలబడి ఎక్కడైనా కనీసం ఒక్క నిమిషం అయినా మాట్లాడగలుగుతారా.. ఆయన ఊపులు, అరుపులకు ఎవరూ భయపడరని కన్నబాబు స్పష్టం చేసారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు కరప వచ్చిన పవన్‌.. తనను ఇష్టం వచ్చినట్లు తిట్టంతో పాటుగా..తనను తరిమి తరిమి కొట్టమని పిలుపునిచ్చారని గుర్తు చేసారు. నాగబాబు ద్వారా చిరంజీవి తో పరిచయం ఏర్పడిందని..తన వంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని భావించిన చిరంజీవి టికెట్‌ ఇస్తే తాను 2009లో గెల్చానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 44 వేల ఓట్లు సాధించానని... ఆ తర్వాత 2019లో జగన్‌ టికెట్‌ ఇచ్చి గెలిపించారు. మంత్రిగా అవకాశం ఇచ్చారు. తనను ఎప్పటికీ తీర్చుకోలేని రుణగ్రస్తుడిని చేశారు. ఇవాళ్టికి కూడా నేను చిరంజీవి గారి ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతానని..తాను.., పవన్‌ కళ్యాణ్‌ ఒకేసారి 2008లో రాజకీయాల్లోకి వచ్చామని.. కానీ ఏనాడైనా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి గారి గురించి మాట్లాడారా అని నిలదీసారు.

English summary
Minister Kanna babu serious comments on Jansena chief pawan Kalyan. Kanna Babu says Pawan playing dramas on sand problem. Pawan working like adopted son of chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X