వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత దారుణమా.. అలాంటి ప్రచారం చేయడానికి సిగ్గు లేదా : చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కన్నబాబు

|
Google Oneindia TeluguNews

వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు,విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు.ట్రంప్‌ పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం లేదని చంద్రబాబు అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటారు తప్ప.. అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఫొటోలు తీయించుకోవాలని, జాతీయ నేతల చేతులు పట్టుకొని తిరగాలన్న కోరికలు ఏమీ ఉండవన్నారు. మంగళవారం కాకినాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

ట్రంప్ ఆరా తీస్తున్నారని సెటైర్స్..

ట్రంప్ ఆరా తీస్తున్నారని సెటైర్స్..


ట్రంప్ పర్యటన నేపథ్యంలో చంద్రబాబుపై సోషల్ మీడియాలో వస్తోన్న సెటైర్స్ అందరూ గమనిస్తున్నారని అన్నారు. ట్రంప్ విమానం దిగగానే చంద్రబాబు ఎక్కడా అని అడిగినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. అమెరికాలో నన్ను ఓడిస్తానన్న చంద్రబాబు ఏం చేస్తున్నారని ట్రంప్ ఆరా తీశారని.. పాపం ఆయన జోలె పట్టుకుని తిరుగుతున్నారని సమాధానం చెప్పారని అన్నారు. అంతేకాదు,చంద్రబాబు ఆస్తులు కూడా ప్రకటించారా అని ట్రంప్ ఆరా తీసినట్టు కూడా ప్రచారం జరుగుతోందన్నారు.

ఇలాంటి ప్రచారం చేయడానికి సిగ్గులేదా..

ఇలాంటి ప్రచారం చేయడానికి సిగ్గులేదా..

చంద్రబాబును వైఎస్ జగన్ ఓడించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చిందని.. ఆ కారణంతోనే ఆయన్ను విందుకు దూరం పెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. అలాంటి ప్రచారం చేయడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ఇదే ట్రంప్‌ను ఓడిస్తానని చంద్రబాబు తెగ హడావుడి చేస్తూ అమెరికా వెళ్లాడన్నారు. తీరా ట్రంప్ గెలిచాడని అన్నారు. ఇక రాష్ట్రంలో జగన్‌ను ఓడిస్తానని తిరిగితే.. ప్రజలు కేవలం 23 సీట్లే ఇచ్చారని గుర్తుచేశారు.

ఇంత దారుణమా..

ఇంత దారుణమా..


దేశమంతా తిరిగి మోదీని ఓడిస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడేమో ఆయనతో గొడవ పెట్టుకుని తప్పు చేశామంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే నలుగురు ఎంపీలను కూడా బీజేపీలోకి పంపించారని.. నాయకులు ఇంత దారుణంగా ఉంటారా అని ప్రశ్నించారు. ఇదేం రాజకీయమో తనకు అర్థం కావడం లేదన్నారు. జగన్ పేరు వింటేనే చంద్రబాబులో వణుకు పుడుతోందని.. జగన్ ఇలాంటి పాలనే అందిస్తూ పోతే తనకు భవిష్యత్తు ఉండదని ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.

దేశమంతా జగన్ వైపు చూస్తుంటే..

దేశమంతా జగన్ వైపు చూస్తుంటే..

రాష్ట్రంలో గత ఐదేళ్లలో జరిగిన అవినీతిని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అమరావతిలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ప్రభుత్వంపై చంద్రబాబుపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల ప్రయోగం దేశంలోనే సంచలనం సృష్టిస్తోందన్నారు. కర్ణాటక, జార్ఖండ్‌ లాంటి రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఈ తరహా ఆలోచన చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం గురించి ఇప్పటికే ఢిల్లీ,మహారాష్ట్ర ప్రభుత్వాలు సమాచారం కోరాయన్నారు.రైతు భరోసాపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయని అన్నారు. దేశమంతా జగన్ పాలన వైపు చూస్తుంటే.. చంద్రబాబుకు మాత్రం నరకాసుర పాలనలా కనిపిస్తోందని మండిపడ్డారు.

English summary
Minister Kanna Babu criticised TDP Chief Chandrababu Naidu for often criticising YSRCP govt,he said Andhra Pradesh people never believe Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X