వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేషన్ డీలర్లకు మంత్రి కొడాలి నాని షాక్ .. బంద్ చేసినా ఏపీలో రేషన్ పంపిణీ ఆగదన్న మంత్రి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 10 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏపీలో రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు నుంచి రేపు రేషన్ షాపులలో రేషన్ పంపిణీ చేయ్యబోమని ఆందోళనకు కు పిలుపునిచ్చిన రేషన్ డీలర్ల అసోసియేషన్ 2020 వ సంవత్సరం నాటి పిఎంజికేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు .

ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు డ్రామాలు .. దిగజారుడు రాజకీయాలు: మంత్రి కన్నబాబు ఆగ్రహంఢిల్లీ వీధుల్లో చంద్రబాబు డ్రామాలు .. దిగజారుడు రాజకీయాలు: మంత్రి కన్నబాబు ఆగ్రహం

డిమాండ్లను పరిష్కరించాలని రేషన్ డీలర్ల ఆందోళన

డిమాండ్లను పరిష్కరించాలని రేషన్ డీలర్ల ఆందోళన

డిడి నగదు వాపసు, ధరల వ్యత్యాసం సర్కిలస్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల నుండి ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించి బకాయిలను తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గోనెసంచులు తిరిగి ఇస్తే 20 రూపాయలు చెల్లించాలనే జీవోను అమలు చేయాల్సిందేనంటూ రేషన్ డీలర్లు ఏపీ సర్కార్ పై ఒత్తిడి చేస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే దాకా ఆందోళన బాట పడతామని చెప్పిన రేషన్ డీలర్లు మొదట బంద్ చేస్తున్నట్లు ప్రకటించినా ఆ తరువాత బంద్ వాయిదా వేసుకున్నామని ప్రస్తుతానికి దుకాణాల్లో సరుకులు దిగుమతి, పంపిణీని నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు.

రేషన్ డీలర్ల ఆందోళనపై స్పందించిన మంత్రి కొడాలి నాని

రేషన్ డీలర్ల ఆందోళనపై స్పందించిన మంత్రి కొడాలి నాని

ప్రభుత్వం దిగిరాకపోతే సంపూర్ణ బంద్ కు దిగుతామని స్పష్టం చేశారు. తన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముందు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని చెప్పిన రేషన్ డీలర్ల సంఘం తమ సమస్యలు పరిష్కరించే వరకు రేషన్ దిగుమతిని, పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ డీలర్ల బంద్ పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నుంచి రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రేషన్ డీలర్ల సంఘం నిర్ణయంపై శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని రేషన్ డీలర్లు బంద్ చేసినంత మాత్రాన రేషన్ పంపిణీ ఆగిపోదని తేల్చి చెప్పారు.

బంద్ చేస్తామని బెదిరిస్తే భయపడేది లేదన్న మంత్రి కొడాలి నాని

బంద్ చేస్తామని బెదిరిస్తే భయపడేది లేదన్న మంత్రి కొడాలి నాని

ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ, బంద్ చేస్తామని బెదిరింపులకు దిగితే ఎవరు భయపడబోరని తేల్చి చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన రేషన్ వాహనాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని వాటి ద్వారా ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ చేరుతుందని కొడాలి నాని తేల్చి చెప్పారు. ఏపీలో బైపాస్ పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తామని వెల్లడించిన ఆయన రేషన్ పంపిణీ నిలిపి వేసి ప్రజలను బాధ పెట్టడం సరైన పని కాదని రేషన్ డీలర్లకు హితవుపలికారు.

Recommended Video

RRR Movie బాహుబలి రేంజ్ లో ఆడాలంటే.. | AP Ticket Price || Oneindia Telugu
సమస్యల పరిష్కార హామీ బదులు షాకింగ్ కామెంట్స్ చేసిన కొడాలి నాని

సమస్యల పరిష్కార హామీ బదులు షాకింగ్ కామెంట్స్ చేసిన కొడాలి నాని

సమస్యలకు ధర్నాలు పరిష్కారం కాదని స్పష్టం చేశారు కొడాలి నాని. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తారని భావించిన రేషన్ డీలర్ల అసోసియేషన్ కు పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఒకింత షాకింగ్ గా అనిపించాయి. ఆందోళన చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందని భావించిన రేషన్ డీలర్లు ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలతో ఆలోచనలో పడ్డారు.

English summary
Minister Kodali Nani made shocking comments on the concern of ration dealers that the govt is not afraid of bandh threaten. Problems should be discussed and resolved with the govt but not with concerns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X