హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా మీవల్లే.. థ్యాంక్స్, అవకాశముంటే మిమ్మల్ని పిలుస్తాం!: చిరంజీవిని కలిసిన మంత్రి కొల్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన కొల్లు రవీంద్ర

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవికి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వచ్చి మరీ థ్యాంక్స్ చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో ఆయన చేసిన పనికి గాను ప్రశంసించేందుకు మెగాస్టార్ ఇంటికి వచ్చారు.

పత్రికల్లో ఏవేవో వస్తుంటాయి!: రంగంలోకి చంద్రబాబు, గంటాకు బుజ్జగింపులుపత్రికల్లో ఏవేవో వస్తుంటాయి!: రంగంలోకి చంద్రబాబు, గంటాకు బుజ్జగింపులు

ఎంపీ లాడ్స్ ద్వారా మచిలీపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు

ఎంపీ లాడ్స్ ద్వారా మచిలీపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు

చిరంజీవి 2012 నుంచి ఇటీవలి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పని చేశారు. చిరంజీవి తన ఎంపీ ల్యాడ్స్ ద్వారా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందించారు. రూ.5 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టారు.

ఏడాదిలో పూర్తి చేస్తాం

ఏడాదిలో పూర్తి చేస్తాం


ఆ పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయని చెబుతూ కొల్లు రవీంద్ర... మెగాస్టార్‌ను కలిశారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో ఏడాదిలోగా మిగిలిన పనులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కొల్లు.. చిరంజీవికి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు చిరంజీవికి రుణపడి ఉంటారని చెప్పారు. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో చేస్తున్న అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని కొల్లు చెప్పారు. చిరంజీవి అడగ్గానే సహాయం చేశారన్నారు. అవకాశం ఉంటే అభివృద్ధి పనులను చిరంజీవి చేతుల మీదుగానే ప్రారంభించేలా చూస్తామన్నారు.

చాలా సంతోషంగా ఉందని చిరంజీవి

చాలా సంతోషంగా ఉందని చిరంజీవి

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. మచిలీపట్నంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎంపీ లాడ్స్ కింద తాను కేటాయించిన నిధులతో ప్రారంభించిన పనులు విజయవంతంగా సాగడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి అభివృద్ధికి చెందిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆ రోజు అడిగారు మీరు ఆ రోజు అడిగారు

ఆ రోజు అడిగారు మీరు ఆ రోజు అడిగారు

ఈ సందర్భంగా చిరంజీవి.. మంత్రి కొల్లు రవీంద్రను కూడా ప్రశంసించారు. ఆ రోజు కొల్లు ముందుకు వచ్చి ఇక్కడ వెనుకబడిన వారికి, అవసరం ఉన్న వారికి కమ్యూనిటీ హాల్స్, రోల్డ్ గోల్డ్ జ్యూవెల్లరీ వర్తకులకు, సీసీ రోడ్లు కావాలని ఆ రోజు అడిగారని గుర్తు చేశారు. కొల్లు అడగడంతో ఆ రోజు ఆ ప్రాంతాన్ని ఎంచుకొని మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాలను దత్తత తీసుకొని నిధులు మంజూరు చేయించానని చెప్పారు.

English summary
Andhra Pradesh Minister Kollu Ravindra meets Congress leader and Former Rajya Sabha Member Chiranjeevi and thanks for MP lads funds for Machilipatnam development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X