గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళితులను అవమానిస్తున్న జగన్:మంత్రి నక్కా ఆనందబాబు

|
Google Oneindia TeluguNews

గుంటూరు:ఎస్సి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి ముఖ్యమంత్రి, మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతికి ,ప్రధానమంత్రికి జగన్ లేఖ రాయడం విడ్డురంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో జగన్ కుటుంబంపై మంత్రి నక్కా ఆనందబాబు విమర్శల వర్షం కురిపించారు.

అసలుదోపిడీకి ,మోసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ కుటుంబం అని...దళితుల భూములను అక్రమించుకున్న ఘన చరిత్ర వై ఎస్ కుటుంబంది అని నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.ఇడుపులపాయలో దళితులకు చెందిన భూములు 600 ఎకరాలు ఆక్రమించుకుని 4 దశబ్దాల పైగా వారి ఆధీనంలో పెట్టుకున్నారని ఆరోపించారు.

చర్యల కోసం...కలెక్టర్ కు లేఖ రాస్తా...

చర్యల కోసం...కలెక్టర్ కు లేఖ రాస్తా...

ఇడుపులపాయలో దళితుల భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని తాను కడప్ కలెక్టర్ కు లేఖ రాయనున్నట్లు మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు.

దళితులకు అవమానం...చేసిన జగన్

దళితులకు అవమానం...చేసిన జగన్

ఆ తరువాత దళితుల కు కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా జగన్ పాదయాత్ర చేయడం విడ్డూరమని...జగన్ దళితులను అవమానిస్తున్నాడని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దళితుల కోసం దేశంలో ఎవరూ చేయనన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.

దళితుల కోసం...చంద్రబాబు పథకాలు

దళితుల కోసం...చంద్రబాబు పథకాలు

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సి,ఎస్టీ కమిషన్ వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని మంత్రి నక్కా ఆనందబాబు కొనియాడారు. అలాగే సబ్ ప్లాన్ నిధులు ఒక్కపైసా దారి మల్లించకుండా దళితుల అభివృద్ధికి ఖర్చు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమని నక్కా ఆనందబాబు చెప్పారు.

 ఎస్సి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై...కోర్టుకు

ఎస్సి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పై...కోర్టుకు

డ్రైవర్లు గా ఉన్న దళితులను ఎస్సి కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా, బొలేరో కార్లు ఇచ్చి వారిని ఓనర్స్ ని చేసిన వ్యక్తి చంద్రబాబు అని...కనీస జ్ఞానము లేని వ్యక్తి జగన్ అని నక్కా ఆనందబాబు అన్నారు. చంద్రబాబు చిత్త శుద్దికి నిలువెత్తు నిదర్శనం అయితే...జగన్ విశ్వసనీయత లేని వ్యక్తి అని చెప్పారు. అయితే ఎస్సి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద మా ప్రభుత్వం కూడా పున:పరిశీలన చెయ్యాలని ప్రభుత్వం తరపున లీగల్ గా కోర్టును ఆశ్రయించనున్నట్లు నక్కా ఆనందబాబు వెల్లడించారు.

English summary
Guntur:Social and Tribal Welfare Minister Nakka Anand Babu came down heavily on YSR Congress president Y.S. Jagan Mohan Reddy alleging that the opposition leader has no concern for Dalit Problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X