• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోకేష్‌ది పెద్ద ప్లానే?: వారసులందరిని పోగేస్తున్నాడు.. ప్రీ-ప్లాన్డ్‌గా ఫ్యూచర్ బాస్?

|

విజయవాడ: వారసత్వ రాజకీయాల్లోనే భారతదేశ ప్రజాస్వామ్యం కునారిల్లుతుండటం ఆది నుంచి ఉన్నదే. ఏటికేడు ఆ పరంపర మరింత విస్తృతి చెందుతుండగా.. సాధారణ ప్రజానీకానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మధ్య అగాథం పెరుగుతూనే ఉంది.

పరువు తీశారు!: పరిటాల శ్రీరామ్, జేసీ పవన్‌ 'స్పోర్ట్స్ స్కామ్'?, వెలుగుచూసిన బాగోతం

పలుకుబడి, డబ్బే ప్రధానమైన చోట.. నాయకుల పుత్ర రత్నాలే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, పార్టీ అధినేతలుగా చలామణి అవుతూ వస్తున్నారు. అదే సమయంలో సాధారణ మధ్య తరగతి యువకులు, ఉన్నత చదువులు చదువుకున్నవారి రాజకీయ ఆకాంక్షలు మృగ్యం అయిపోతూనే ఉన్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో.. ఏపీ రాజకీయాల్లోను మరోసారి వారసత్వ వరద పారే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల వారసులంతా తమ రాజకీయ తెరంగేట్రానికి అంతర్గతంగా ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేష్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతున్నట్లు గుసగసలు వినిపిస్తుండటం గమనార్హం.

శ్రీకాకుళం, విజయనగరంలలో కుమార్తెల జోరు:

శ్రీకాకుళం, విజయనగరంలలో కుమార్తెల జోరు:

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె శిరీష 2019ఎన్నికల్లో రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కూడా వచ్చే ఎన్నికల కోసం అంతా సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇక దశాబ్దాలుగా విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్న కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అశోక్ గజపతిరాజుకు వయసు మీద పడుతుండటంతో.. ఆయన స్థానంలో ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇక శ్రీకాకుళం జిల్లాకె చెందిన పతివాడ నారాయణస్వామి కుమారుడు అప్పలనాయుడు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కూడా వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

  పవన్ చెబితేనే సమస్య పరిష్కారమా? లోకేష్ : ‘జగన్ ఏకైక వ్యక్తి’ Nara Lokesh About YS Jagan
  విశాఖలో, గోదావరి జిల్లాల్లో వారసుల జోరు:

  విశాఖలో, గోదావరి జిల్లాల్లో వారసుల జోరు:

  మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజను రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు, మంత్రి లోకేష్ సన్నిహితుడైన విజయ్ కూడా తన పొలిటికల్ ఎంట్రీకి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

  తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఒకే పార్టీలో ఉన్నప్పటికీ యనమలతో శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న జ్యోతుల నెహ్రూ తనయుడు కూడా తన రాజకీయ రంగ ప్రవేశానికి సన్నద్దమవుతున్నారు.

  ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే మాగంటి బాబు కుమారులు రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు.

  కృష్ణా, గుంటూరుల్లో:

  కృష్ణా, గుంటూరుల్లో:

  కృష్ణా జిల్లాలో దివంగత నేత దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ఇప్పటికే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అతను.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనుకుంటున్నాడు.

  గుంటూరు జిల్లా నుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ కూడా పొలిటికల్ ఎంట్రీ కోసం ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.

  రాయలసీమ జిల్లాల్లో:

  రాయలసీమ జిల్లాల్లో:

  కర్నూలు నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కుమారుడు, కడప నుంచి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి తనయుడు రాజకీయ తెరమీదకు వచ్చే అవకాశాలున్నాయి. ఇక అనంతపురం రాజకీయాల్లో పేరొందిన పరిటాల కుటుంబం నుంచి.. పరిటాల శ్రీరామ్ తెర పైకి వచ్చే సూచనలున్నాయి.

  ఇక అదే జిల్లాకు చెందిన జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా పొలిటికల్ ఎంట్రి ఇచ్చే అవకాశాలున్నాయి. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వారసులు కూడా రాజకీయ ఆరంగేట్రానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకే చెందిన గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయులు కూడా రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది.

  వారసులందరికీ లోకేష్ బాస్?:

  వారసులందరికీ లోకేష్ బాస్?:

  సీనియర్ నేతల వారసులందరితోను టచ్ లో ఉంటున్న మంత్రి లోకేష్.. వీళ్లందరిని రాజకీయాల్లోకి తీసుకొస్తే తన పట్టు పెంచుకోవచ్చని ఆయన భావిస్తున్నారు. సీనియర్ నేతలను నిర్మొహమాటంగా పక్కనపెట్టి వారి స్థానంలో వారసులకు అవకాశం కల్పించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనంలో సొంత ఇమేజ్, బలం ఏర్పరుచుకోలేకపోయిన లోకేష్.. పార్టీ విషయంలో మాత్రం ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.

  పార్టీ తన పట్టు తప్పిపోకుండా ఉండేందుకు వారసులను రంగంలోకి దించాలనే ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించి తెర వెనుక వ్యూహాల్లో ఆయన తలమునకలై ఉన్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. సీఎం చంద్రబాబుకు కూడా వయసు మీద పడుతుండటంతో ఆయన స్థానంలోకి వెళ్లాలని లోకేష్ ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి ఏపీ టీడీపీలోకి యువరక్తం పోటెత్తె అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది.

  English summary
  AP Minister Nara Lokesh is encouraging youth leaders, especially successors of senior leaders for 2019elections
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X