వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడ ఉద్యమం ఏమైంది? టీడీపీతోనే కాపులు: నారాయణ విమర్శలు

ముద్రగడ పద్మనాభంకు ప్రజల మద్దతు లేదని కాకినాడ కార్పొరేషన్‌ విజయంతో తేలిపోయిందని మంత్రి నారాయణ అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముద్రగడ పద్మనాభంకు ప్రజల మద్దతు లేదని కాకినాడ కార్పొరేషన్‌ విజయంతో తేలిపోయిందని మంత్రి నారాయణ అన్నారు. ముద్రగడను తిరస్కరించినట్లేనని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి భేటీ అయ్యారు.

కాకినాడలో టీడీపీ గెలుపునకు కృషి చేసిన మంత్రిని సీఎం అభినందించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. కాపులు ఎక్కువగా ఉన్న కాకినాడలో ఈ స్థాయి విజయం దక్కిందంటే వారంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్లేనని నారాయణ పేర్కొన్నారు. ఎన్నికలు ముగియగానే ముద్రగడ ఉద్యమాన్ని వాయిదా వేశారని మంత్రి ఆరోపించారు.

minister Narayana fires at mudragada padmanabham

కాపు రిజర్వేషన్లపై త్వరలోనే నివేదిక రానుందని నారాయణ స్పష్టంచేశారు. మరోవైపు ప్రతిపక్షనేత జగన్‌ వ్యాఖ్యలు సహించరానివిగా ఉన్నాయన్నారు. అందుకే ఆయన్ను రెండు చోట్లా ప్రజలు తిరస్కరించారన్నారు. జగన్‌ ప్రతి గడపా తొక్కినా.. ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు.

English summary
Andhra Pradesh minister Narayana fired at Mudragada Padmanabham after Kakinada Corporation elections results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X