వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు నిర్మాణం పనులు పరిశీలించిన మంత్రి నారాయణ...శరవేగంగా పూర్తి చేయాలి!

|
Google Oneindia TeluguNews

అమరావతి:నవ్యాంధ్ర రాజధానిలో అమరావతిలో హైకోర్టు నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. డిసెంబర్ 15 వ తేదీ లోగా హైకోర్టు భవనాల నిర్మాణం
పూర్తిచేస్తామని ఎపి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపిన నేపథ్యంలో మంత్రి నారాయణ హై కోర్ట్ కన్ స్ట్రక్షన్ పనుల పురోగతిని స్వయంగా పరిశీలన చేశారు.

పనులు అత్యంత వేగవంతంగా పూర్తిచేయాలంటూ అధికారులకు సూచించిన మంత్రి నారాయణ నాణ్యతను విస్మరించవద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో నిర్మాణ గోడలు, జాయింట్ కమ్మీలు, పిల్డర్న్ నిర్మాణాల పనులు పరిశీలించిన మంత్రి నారాయణ నాణ్యతలేదని గుర్తించిన పిల్డర్న్ తొలగించి మళ్ళీ నిర్మించాలని అధికారులకు సూచించారు.

అనంతరం కోర్టు ప్రాంగణంలో శరవేగంగా నిర్మితమవుతున్న కార్ పార్కింగును భవనాన్ని మంత్రి నారాయణ పరిశీలించి పనులు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన విచారణలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సుప్రీం కోర్టు సానుకూలత తెలిపిన సంగతి తెలిసిందే.

Minister Narayana Inspects High court Building Construction Works in Amaravathi

డిసెంబర్ 15వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదలకు ఉత్తర్వులు జారీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అప్పటికల్లా అమరావతిలో తాత్కాలిక కోర్టు భవన నిర్మాణం పూర్తి అవుతుందని ఏపీ ప్రభుత్వం అఫిడివిట్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తన నిర్ణయం వెల్లడించింది. ఏపీలో హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ కోర్టుకు సమర్పించింది.

ఏప్రిల్ నాటికి స్టాప్ క్వార్టర్స్, జడ్జిల నివాసాలు నిర్మిస్తామని...న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిందని ఏపీ తరఫు లాయర్ నారీమన్ సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

English summary
Minister Narayana examined the construction of the high court buildings in Amaravathi. AP Government cleared that it will complete the construction of High Court buildings by December 15, In this background Minister Narayana has reviewed the progress of the construction activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X