వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేస్ కొత్త రాజధాని నిర్మాణం, మాస్టర్ ప్లాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. గురువారం ఉదయం సింగపూర్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో పాటు రాజధాని ప్రాంత పరిధిలోని అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. ఏరియల్‌ సర్వేతో సింగపూర్‌ అధికారుల బృందం సంతృప్తి చెందినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో 500 ఏళ్ల రెవెన్యూ రికార్డులు వారు అడిగారని తెలిపారు.

రాజధాని ప్రాంతంలో పంటల వివరాలు, నీటిసమస్యలు, గతంలో వచ్చిన భూకంపాల వివరాలను సింగపూర్‌ ప్రతినిధులు అడిగారని మంత్రి నారాయణ చెప్పారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌పై చేసుకున్న ఒప్పందాలలో ఎటువంటి లోపాలు లేవని చెప్పారు.

సింగపూర్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ క్యాప్, ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్ ఆఫ్ సింగపూర్ మధ్య ఎంఓయు జరిగినట్లు తెలిపారు. ఎంఓయులో పేర్కొన్న సంస్థలన్నీ సింగపూర్ ప్రభుత్వానికి చెందినవేనని చెప్పారు.

సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..

సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..

గురువారం ఉదయం సింగపూర్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..

సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..


కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో పాటు రాజధాని ప్రాంత పరిధిలోని అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. ఏరియల్‌ సర్వేతో సింగపూర్‌ అధికారుల బృందం సంతృప్తి చెందినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

 సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..

సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..


రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో 500 ఏళ్ల రెవెన్యూ రికార్డులు వారు అడిగారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పంటల వివరాలు, నీటిసమస్యలు, గతంలో వచ్చిన భూకంపాల వివరాలను సింగపూర్‌ ప్రతినిధులు అడిగారని మంత్రి నారాయణ చెప్పారు.

 సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..

సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..


ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌పై చేసుకున్న ఒప్పందాలలో ఎటువంటి లోపాలు లేవని చెప్పారు. సింగపూర్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగిందన్నారు.

సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..

సింగపూర్ బృందంతో మంత్రి నారాయణ భేటీ..


కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ క్యాప్, ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్ ఆఫ్ సింగపూర్ మధ్య ఎంఓయు జరిగినట్లు తెలిపారు. ఎంఓయులో పేర్కొన్న సంస్థలన్నీ సింగపూర్ ప్రభుత్వానికి చెందినవేనని చెప్పారు.

English summary
P.Narayana Minister of AP Meeting with Singapoor Delegates at AP Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X