వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్:మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గా మంత్రి నారాయణ

|
Google Oneindia TeluguNews

అమరావతి:నిర్లక్ష్యం విషయంలో ప్రభుత్వ శాఖలదే పేటెంట్...అంతులేని అలక్ష్యం ప్రదర్శించడంలో గవర్నమెంట్ ఉద్యోగుల తరువాతే మరెవరైనా అని అనేక సందర్భాల్లో నిరూపితమవుతూ ఉంటుంది. అదే క్రమంలో తాజాగా మంగళగిరి పురపాలక సంఘం ఉద్యోగలు చేసిన ఓ ఘనకార్యం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యానికి తిరుగులేని సాక్ష్యంగా నిలచింది. అదేంటో మీరూ చూడండి!...

వేసవి తాకిడి అప్పుడే మొదలవడంతో మంగళగిరి పట్టణం పరిథిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. అయితే ఆలోచన బాగానే ఉన్నా ఆచరణలో మున్సిపల్ సిబ్బంది చేసిన ఓ పొరపాటు ఆ శాఖను నవ్వులపాలు చేసింది. ఇంతకీ వారు చేసిన ఆ పని ఏంటంటే...మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాల బ్యానర్లపై మంగళగిరి మునిసిపాలిటీ కమిషనర్ గా...పురపాలక శాఖ మంత్రి నారాయణ పేరును వేయడమే కాదు ఏకంగా ఆయన ఫోటోను సైతం ముద్రించారు.

Minister Narayana name printed as the Municipal Commissioner

సాక్షాత్తూ మున్సిపల్ శాఖామాత్యులనే మంగళగిరి కమీషనర్ చేసేసిన స్థానిక మున్సిపల్ సిబ్బంది నిర్వాకం గురించి స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. పురపాలక శాఖా మంత్రి నారాయణ...మంగళగిరి మున్సిపాలిటీ కమీషనర్ గా ఎప్పుడయ్యారు...ఎలా అయ్యారని జోకులు వేసుకుంటున్న...మంగళగిరి మున్సిపాలిటీ సిబ్బంది ఏమైనా చెయ్యగలరని ఎద్దేవా చేస్తున్నారు.

అయితే ఇది ఏ ఒక్క చలివేంద్రం వద్దో జరిగిన పొరపాటు కాదు...నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి చలివేంద్రం వద్ద ఉన్న ఫ్లెక్సీలపై ఇదే తప్పు పునరావృతమైంది. అయితే అప్పుడప్పుడు పొరపాట్లు జరగడం సహజమే అయినా ఇంత పెద్ద మిస్టేక్ జరిగినా సిబ్బంది గమనించకపోవడం, ఒకవేళ గమనించినా ఆ పొరపాటును సరిదిద్దేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చలివేంద్రాల ప్రారంభానికి ముందే స్థానికులు అనేకమంది ఈ తప్పు గురించి సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా వారు లైట్ తీసుకోవడంతో పాటు ఆ ఫ్లెక్సీలను అలాగే ఉంచి చలివేంద్రాలను ప్రారంభించేస్తున్నారు.

Recommended Video

విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట

దీంతో ఆ చలివేంద్రాల వద్దకు మంచినీరు తాగేందుకు వచ్చిన జనాలు ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇంకా అనేక చలివేంద్రాలను ప్రారంభించాల్సి ఉండగా వాటి వద్దయినా ఫ్లెక్సీలను మార్చి ఉండాల్సిందని...పొరపాటు జరిగిందని తెలిసినా, ఆ విషయం చెప్పినా పట్టించుకోకపోవడం మంగళగిరి మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Amaravathi:The mistake of the Mangalgiri municipality staff has been a disgrace for their department. Minister Narayana name printed as the Municipal Commissioner on the flexi's of water service centers established by mangalagiri Municipality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X