వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నారా లోకేష్ తండ్రిలాగే రాజకీయ బుద్ది బయటపెట్టుకున్నారు'

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఇటీవల మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌పై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. వరుస వీడియోలతో టీడీపీ యువనేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళా దళిత డాక్టర్‌కు అన్యాయం జరిగినట్లు లోకేష్ విమర్శలు గుప్పించగా, దీనికి కౌంటర్‌గా వరుసగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో వీడియోలు పోస్ట్ చేశారు. స్వయంగా నారాయణస్వామి కూతురు కూడా ఈ ఘటనపై స్పందించారు. సదరు మహిళా డాక్టర్ విధులకు సంబంధించిన ఫైల్‌ను చూడాలని సూచించారు.

ఈ ఏడాది మార్చి 22న పెనమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భరత్ అనే వ్యక్తి వైద్యం కోసం వచ్చాడు. డాక్టర్ అనితా రాణి అతనికి వైద్యం చేయకపోగా, తలుపులు వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కులం పేరుతో దూషించినట్లు అనితా రాణి.. భరత్‌పై ఫిర్యాదు చేశారు. భరత్ కూడా వైద్యసేవలు అందించలేదని ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో నిజానిజాలు తేల్చాలని సీఎం జగన్ ఈ కేసును సీఐడీకి అప్పగించారు.

Minister Narayana Swamy questions Nara Lokesh over Doctor issue

ఇదిలా ఉండగా, ఈ రోజు భరత్‌కు మాట్లాడిన రెండు వీడియోలు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఓ కేసులో తాను అనితారాణిపై ఉద్దేశ్యపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, అలాగే ఆమెను కులం పేరుతో దూషించలేదని, వైద్యం అందించలేదని ఫిర్యాదు చేశానని భరత్ ఓ వీడియోలో చెప్పారు. మేడం మీపై వ్యక్తిగత కక్ష లేదన్నారు. మరో వీడియోలో భరత్ మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూ రోజు తనకు గాయమైతే ఆసుపత్రికి వెళ్లగా అనితారాణి మేడం తలుపులు వేసుకున్నారని, దీంతో తాము ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆ తర్వాత తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని తెలిసిందని, దీంతో డాక్టర్ వద్దకు వెళ్లి ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని కూడా కోరామని పేర్కొన్నారు.

నారాయణస్వామి ఈ రెండు వీడియోలు పోస్ట్ చేసి నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అన్న మీ నాన్నతో ఎప్పుడు క్షమాపణ చెప్పిస్తావని ప్రశ్నించారు. అలాగే, వైద్యం కోసం వచ్చిన సామాన్యుడికి వైద్యం చేయకపోగా దౌర్జన్యం చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి కులం కార్డు తగిలించి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, లోకేష్ కూడా అదే నీచ రాజకీయ బుద్ది బయట పెట్టుకున్నారన్నారు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేయదు కదా అని పేర్కొన్నారు.

English summary
Andhra Pradesh deputy chief minister narayanaswamy fired at former minister Nara Lokesh and TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X