అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి రైతైన వేళ: పంచె కట్టి, రుమాలు చుట్టి పొలం దున్నిన పల్లె(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతున్నారు. తమ శాఖలకు చెందిన ముఖ్యమైన కార్యక్రమాలు మినహా మిగిలిన సమయమంతా వారు జనంతోనే ఉంటున్నారు.

ఈ క్రమంలో జనంతో మమేకమవుతున్న మంత్రి.. అన్నదాతల కుటుంబం నుంచి వచ్చిన తమ నేపథ్యాన్ని చాటుకుంటున్నారు. ఏపీ సర్కారు చేపట్టిన 'ఏరువాక' కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అచ్చమైన రైతులా కనిపించారు.

రైతు బిడ్డ: ఒడికట్టి విత్తనమేసిన ఏపీ మంత్రి పరిటాల సునీత

వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. వెరసి జిల్లాలో పెద్ద ఎత్తున సాగు కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం గార్లదిన్నెలో పర్యటించిన మంత్రి పల్లె... పంచె కట్టులో కనిపించారు.

పార్టీని వదిలి వ్యవసాయం చేసుకుంటున్న టిడిపి ఎంపీ, కారణం అదేనా?

రాయలసీమ స్టైల్లో.. తెల్లటి పంచె కట్టి, దానిని మోకాళ్ల దాకా పైకెత్తి కట్టి, తలకు రుమాలు చుట్టి, చొక్కా విప్పేసి కేవలం బనియన్ మీదే పొలంలోకి దిగిన ఆయన.. అక్కడ అప్పటికే సిద్ధమైన గొర్రు పట్టి విత్తనమేశారు. స్వయంగా మంత్రి గొర్రు పట్టడంతో అక్కడి రైతులు ఉత్సాహంగా ఏరువాకలో పాలుపంచుకున్నారు.

ప్రజలతో పల్లె

ప్రజలతో పల్లె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతున్నారు.

పొలంలో మంత్రి పల్లె

పొలంలో మంత్రి పల్లె

తమ శాఖలకు చెందిన ముఖ్యమైన కార్యక్రమాలు మినహా మిగిలిన సమయమంతా వారు జనంతోనే ఉంటున్నారు.

పొలంలో మంత్రి పల్లె

పొలంలో మంత్రి పల్లె

ఈ క్రమంలో జనంతో మమేకమవుతున్న మంత్రి.. అన్నదాతల కుటుంబం నుంచి వచ్చిన తమ నేపథ్యాన్ని చాటుకుంటున్నారు.

పొలంలో మంత్రి పల్లె

పొలంలో మంత్రి పల్లె

ఏపీ సర్కారు చేపట్టిన ‘ఏరువాక' కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అచ్చమైన రైతులా కనిపించారు.

పొలంలో మంత్రి పల్లె

పొలంలో మంత్రి పల్లె

వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు.

విద్యార్థులతో ముచ్చటిస్తూ..

విద్యార్థులతో ముచ్చటిస్తూ..

వెరసి జిల్లాలో పెద్ద ఎత్తున సాగు కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం గార్లదిన్నెలో పర్యటించిన మంత్రి పల్లె... పంచె కట్టులో కనిపించారు.

విద్యార్థులతో ముచ్చటిస్తూ..

విద్యార్థులతో ముచ్చటిస్తూ..

రాయలసీమ స్టైల్లో.. తెల్లటి పంచె కట్టి, దానిని మోకాళ్ల దాకా పైకెత్తి కట్టి, తలకు రుమాలు చుట్టి, చొక్కా విప్పేసి కేవలం బనియన్ మీదే పొలంలోకి దిగిన ఆయన.. అక్కడ అప్పటికే సిద్ధమైన గొర్రు పట్టి విత్తనమేశారు. స్వయంగా మంత్రి గొర్రు పట్టడంతో అక్కడి రైతులు ఉత్సాహంగా ఏరువాకలో పాలుపంచుకున్నారు.

English summary
Minister Palle Raghunatha Reddy turned a farmer for a while to participate in the ‘Eruvaka’ programme, organised in Garladinne on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X