అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిద్దరూ కలిసిపోయారు, పక్కపక్కనే పరిటాల, వరదాపురం సూరి, ఆప్యాయంగా ఇలా...

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం:అవును, వారిద్దరి మధ్య మద్య విబేధాలు తొలగిపోయాయి. ఒకరిపక్కనే మరోకరు కూర్చోని అరగంటపాటు చర్చించుకొన్నారు. ఆత్మీయంగా పలకరించుకొన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ( వరదాపూరం సూరి) కలిసి చర్చించుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అనంతపురం జిల్లాలో టిడిపి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కల్గిస్తోందని బాబు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల సునీత వర్గం సూర్యనారాయణ వర్గం బాహాబాహీకి దిగడం పట్ల బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెంపొందించుకొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులకు అప్పగించారు.

Minister Paritala Sunitha and Dharmavaram MLA Suryanarayana became friends

అయితే ధర్మవరంలో శనివారం నాడు టీడీపీ నాయకుడు నాగశేషు కుమార్తె సౌమ్య వివాహంలో ఆ ఇద్దరూ ఒకే చోట కూర్చోని అరగంటకు పైగా మాట్లాడుకొన్నారు. మంత్రి పరిటాల సునీత రాగానే ఎమ్మెల్యే సూర్యనారాయణ తన పక్కన కూర్చొన్న వారిని లేపి మంత్రిని కూర్చోబెట్టుకొన్నారు.

అంతలోనే మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడ అక్కడకు వచ్చాడు. ఎమ్మెల్యే సూర్యనారాయణతో కరచాలనం చేసి దగ్గర్లోనే కూర్చొన్నాడు. ఆ వాతావరణం ధర్మవరంలో ఇద్దరి మధ్య పోరుకు తెరపడిందనే అభిప్రాయాన్ని కల్పించింది.

రెండేళ్ళుగా మంత్రి సునీత, ఎమ్మెల్యే సునీత మద్య విబేధాలు సాగుతున్నాయి. ఆ ఇద్దరి విభేదాల విషయంలో నాలుగైదు సార్లము సిఎం చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొన్నారు. ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు.అయితే శనివారం నాడు మాత్రం ఇద్దరి మధ్య ఆత్మీయత కన్పించడంతో పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకొన్నాయి.

English summary
Minister Paritala Sunitha and Dharmavaram MLA Suryanarayana became friends.They are discussed around 30 minutes at Dharmavaram Tdp leader function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X