వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసభ్య పదజాలంతో తిడతావా: జగన్‌కు పరిటాల సునీత హెచ్చరిక

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయడం సరికాదని మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డిలు మంగళవారంమండిపడ్డారు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయడం సరికాదని మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డిలు మంగళవారం మండిపడ్డారు.

సోమవారం నాడు హంద్రీనావా ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ ఉరవకొండలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పైన మండిపడ్డారు. అనంతలో జగన్ నిర్వహించిన సభకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు.

<strong>జ్యోతుల నెహ్రూకు 'టిడిపి' షాక్: పార్టీలో అలజడి, రిజైన్‌కు అతను రెడీ!</strong>జ్యోతుల నెహ్రూకు 'టిడిపి' షాక్: పార్టీలో అలజడి, రిజైన్‌కు అతను రెడీ!

రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఉరవకొండ పర్యటనలో జగన్‌ ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో వ్యాఖ్యానించారని మండిపడ్డారు.

Minister Paritala Sunitha takes on YS Jagan

హంద్రీనీవా మొదటి దశలో 90శాతం పనులు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగాయన్న వ్యాఖ్యల్ని మంత్రులు ఖండించారు. వైయస ్ హయాంలో 90 శాతం పనులు జరగలేదని, 90శాతం నిధులు దోచుకున్నారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి, అర్హత ప్రతిపక్ష నేత జగన్‌కు లేవని ధ్వజమెత్తారు. హంద్రీనీవా కోసం రూ.2,800కోట్లు ఖర్చు చేసి చెరువులకు నీరిస్తుంటే.. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం దారుణమన్నారు.

English summary
Minister Paritala Sunitha On tuesday lashed out at YSRCP chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X