వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతిలో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటారా.. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్...

|
Google Oneindia TeluguNews

తిరుపతి ఉప ఎన్నిక ఏపీలో కాకరేపుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీ నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. తిరుపతి ఉప ఎన్నిక.. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుకు సవాల్ విసిరారు. తిరుపతి బై పోల్‌ను టీడీపీ రెఫరెండంగా భావించాలని కోరారు.

 అంత లేదు..

అంత లేదు..

బై పోల్‌లో టీడీపీ గెలిచే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికకు టీడీపీ రెఫరెండంగా తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసాం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సిద్దమా అంటూ ప్రశ్నించారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానం అని పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. దీనికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇంతకన్నా రెఫరెండం ఏముంటుంది అని అడిగారు. బై పోల్ ఫలితం తర్వాత టీడీపీ స్థానం ఏంటో తెలుస్తోందని తెలిపారు.

 అమరావతిపై కూడా

అమరావతిపై కూడా

అమరావతి రాజధానిపై కూడా రెఫరెండం చర్చ జరుగుతుంది. జనభేరి ఉద్యమ వేదికగా చంద్రబాబు చేసిన కామెంట్స్ కాకరేపాయి. దీనిపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి అమరావతి అంశంపై ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. దీనిపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రతిసవాల్ విసిరారు. అందుకు తాను సిద్దమని ప్రకటించారు. ఒక్క కృష్ణా జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

రెఫరెండం

రెఫరెండం

ఇటు తిరుపతి బై పోల్.. అటు అమరావతి రాజధాని కోసం రెఫరెండం అంటూ చర్చ జరుగుతుంది. అధికార విపక్ష నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే ఎన్నికలో ఎవరూ గెలుస్తారో చూడాలీ. విజయం సాధించేది ఎవరో.. అపజయం పొందేది ఎవరో మరికొద్దిరోజుల్లో తేలనుంది.

English summary
andhra pradesh minister peddi reddy ramachandra reddy slams chandrababu naidu on tirupati by poll issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X