• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు బాటలోనే లోకేష్ విష ప్రచారం.. ప్రజల చేతిలో బడితె పూజ ఖాయం : మండిపడిన మంత్రి

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన దారిలోనే ఆయన కుమారుడిని కూడా నడిపిస్తున్నారని మంత్రి మండిపడ్డారు . అబద్దాలు చెప్పడం, విష ప్రచారం చేయడం, ఆధారాలు లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదగాలని చూడడం చంద్రబాబు నైజం అని, ఇక అదే దారిలో చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను కూడా నడిపిస్తున్నారని ఆయనఫైర్ అయ్యారు.

చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్..జూమ్ పెద్దబాబు,ట్విట్టర్ చినబాబు అంటూ ఎద్దేవా !!చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్..జూమ్ పెద్దబాబు,ట్విట్టర్ చినబాబు అంటూ ఎద్దేవా !!

ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఫైర్

ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఫైర్

ఒక చిన్నారి లైంగిక వేధింపుల కేసులో ఒక హెడ్ మాస్టర్ పై చట్టరీత్య చర్య తీసుకుంటే,ఈ విషయంలో తలదూర్చి పత్రికా విలేఖరి వ్యవహారం నడిపించారని చూడటంతో ఆగ్రహించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు దాడి చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో దాడి చేయించింది తానేనంటూ ఆధారాలు లేని ఆరోపణలు లోకేష్ చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో జరిగిన దాడి ఘటనను తనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 ప్రజలు చెప్పులతో కొట్టే రోజు వస్తుందని వార్నింగ్

ప్రజలు చెప్పులతో కొట్టే రోజు వస్తుందని వార్నింగ్

ఇతరులపై నిందలు వేయడం, ఆధారాలు లేని ఆరోపణలతో ట్వీట్లు మీద ట్వీట్లు చేయడంతో నారా లోకేష్ నైజమేంటో అర్థమవుతుందని, తండ్రి బాటలోనే ఆయన కూడా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇదే వ్యవహారంపై నారా లోకేష్ కు హితవు పలికారు. మీ తండ్రి ఎలాంటి రాజకీయాలు చేశారో , దాని ఫలితమేమిటో ఈరోజు అనుభవిస్తున్నారు. నువ్వు కూడా అటువంటి రాజకీయాలే చేస్తున్నావ్. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు చెప్పులతో కొట్టే రోజు వస్తుంది అంటూ ఘాటుగా విమర్శించారు.

తండ్రీ కొడుకులకు బడితె పూజ తప్పక చేస్తారు

తండ్రీ కొడుకులకు బడితె పూజ తప్పక చేస్తారు

ఆధారం లేని ఆరోపణలు చేస్తే తండ్రి కొడుకులు ఇద్దరికీ ప్రజలు బడితె పూజ తప్పక చేస్తారని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబే కాదు లోకేష్ కూడా విషపు ఆలోచనలు చేస్తున్నారని, వారి వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రతి దాన్నీ రాజకీయం చేయాలని చూస్తే, విషపు రాజకీయాలను ప్రజలు సహించరు అంటూ ఆయన పేర్కొన్నారు.

 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి లోకేష్ పోస్ట్ .. అందుకే ఇంత ఘాటుగా ...

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి లోకేష్ పోస్ట్ .. అందుకే ఇంత ఘాటుగా ...

లోకేష్ ఇటీవల చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియా వేదికగా మంత్రిని టార్గెట్ చేశారు .పత్రికా స్వేచ్చ ను ఏపీలో అధికార పార్టీ మంత్రులు , నాయకులు హరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనుషులు జర్నలిస్ట్ ఇంటిపై దాడి చేసి అతని ఆస్తిని ధ్వంసం చేయడాన్ని చూసి షాక్ అయ్యారు. గూండాలు కుటుంబాన్ని పెట్రోల్‌తో వేసి సజీవ దహనం చేస్తామని బెదిరించారు. ఓం ప్రతాప్ మరణంతో పాటు, వైయస్ఆర్సిపి ఇసుక మాఫియాను గుట్టు రట్టు చేసినందుకు ప్రతీకారంగా మంత్రి చేయించిన దాడిగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు.

English summary
Andhra Pradesh State Panchayati Raj Rural Development Minister Peddireddy Ramachandrareddy has expressed anger over TDP chief Chandrababu, his son and former minister Lokesh. The minister was incensed that Chandrababu was also leading his son on his way. He said that it was Chandrababu's right to lie, spread poisonous propaganda and see himself grow up politically with baseless allegations, and that Chandrababu was also leading his son Lokesh in the same path.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X