హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు: పీతల సుజాతకు ఫస్ట్ ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ ఎవరికి?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా ర్యాంకులు కేటాయించారు. సోమవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ ర్యాంకులను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతకు మొదటి ర్యాంక్ దక్కగా, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పని చేస్తున్న ఎమ్మెల్సీ నారాయణకు చివరి ర్యాంక్ వచ్చింది.

ఇక రెండో ర్యాంకు దేవినేని ఉమామహేశ్వరరావు, మూడో ర్యాంకు పత్తిపాటి పుల్లారావు, ఆరో ర్యాంకు రావెల కిశోర్ బాబు, ఏడో ర్యాంకు అచ్చెన్నాయుడు, పదకొండవ ర్యాంకులో పల్లె రఘనాథ రెడ్డి, పదమూడవ ర్యాంకులో మృణాళినికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

మండల సమన్వయ కమిటీలతో పాటు జిల్లాలోని సమన్వయ కమిటీలు నిర్వహించిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పక్కా సమాచారం ఇచ్చిన మంత్రులకు మంచి ర్యాంకులు వచ్చినట్లు తెలుస్తోంది. అరకొరక సమాచారం ఇచ్చిన మంత్రులకు తక్కువ ర్యాంకులు కేటాయించారు.

Minister Peethala Sujatha got first rank in chandrababu naidu cabinet

మంత్రులకు ర్యాంకులు:

పీతల సుజాత - 1వ ర్యాంక్
దేవినేని ఉమామహేశ్వరరావు- 2వ ర్యాంక్‌
ప్రత్తిపాటి పుల్లారావు- 3వ ర్యాంక్‌
రావెల కిశోర్‌బాబు- 6వ ర్యాంక్‌
అచ్చెన్నాయుడు- 7వ ర్యాంక్‌
పల్లె రఘునాథ్‌రెడ్డి- 11వ ర్యాంక్‌
కిమిడి మృణాళిని- 13వ ర్యాంక్‌

కాగా విజయవాడలో చంద్రబాబు ఎండ తీవ్రతపై మీడియాతో మాట్లాడారు. ఎండల ధాటికి తాళలేక వడదెబ్బకు గురై పలువురు మరణిస్తున్నారని అన్నారు. వేసవి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఈ మూడు కోట్ల రూపాయలతో ఎక్కడ అవసరమో అక్కడ చలివేంద్రాలు పెట్టడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం, భారీ ఎత్తున మజ్జిగ అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇక్కడ డబ్బుకంటే ప్రజాశ్రేయస్సు ముఖ్యమని ఆయన చెప్పారు. వీటి తనిఖీకి జిల్లా మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ నేత ముగ్గుర్నీ పంపుతామని ఆయన తెలిపారు.

ఇలా వేసవి, కరువు ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పశుగ్రాసానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. రైతులకు మెరుగైన విధానాలు అందుబాటులోకి తీసుకొచ్చి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. గ్రామంలో ఎంత మంది రైతులు ఉన్నారు.

వారి ఆర్థిక స్థాయి లేంటి, వారిలో ఎవరి దగ్గర పశువులు ఉన్నాయి? ఇలా డేటా సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ డేటా సేకరణ వల్ల భవిష్యత్ లో కరువును ఎదుర్కోవడంతో పాటు, రైతును ఆదుకునే వెసులు బాటు ఉంటుందని ఆయన చెప్పారు. పగలు 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరూ బయటకి రావద్దని ఆయన సూచించారు.

రాష్ట్రంలో మొత్తం 7,232 చలివేంద్రాలు పెట్టామని ఆయన చెప్పారు. 6 లక్షలకు పైగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేశామని ఆయన తెలిపారు. ప్రతి జిల్లాకు 3 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నిధులను కలెక్టర్ పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని 563 గ్రామాలకు వివిధ రూపాల్లో తాగునీటి సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఏడాది తీసుకున్న చర్యలవల్ల భూగర్భజలాలు పెరిగాయని ఆయన వెల్లడించారు. గత ఏడాది కంటే తీవ్రమైన ఎండలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, పట్టణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాగు నీటి సమస్య లేకుండా చేస్తామని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 15 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పారు. 8,50,000 ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు 13 లక్షల మంది ప్రస్తుతం శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ సంఖ్య 25 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వీరు పని చేసేటప్పుడు వారికి మంచినీరు, మజ్జిగ అందించేందుకు ఒక మనిషిని నియమించామని ఆయన తెలిపారు. మరుగుదొడ్లు కట్టుకోవాలనే వారికి ప్రభుత్వం తరపుణ కట్టిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

English summary
Minister Peethala Sujatha got first rank in chandrababu naidu cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X