వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచాలపై మంత్రి పేర్ని నానీ షాకింగ్ కామెంట్స్ ..ఏమన్నారో తెలుసా!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి లంచాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . విజయవాడలో జరిగిన ఏపీ ఉద్యోగ జెఏసి తృతీయ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలోనే లంచాలపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉన్నా ఉద్యోగులకు న్యాయం జరిగితే చాలు అని అన్నారు. ఇక ఉద్యోగులు లంచం తీసుకోవడం అనే అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

సిఐడీ .. ఈడీ.. ఐటీ... ముప్పేట దాడులతో టీడీపీ లో టెన్షన్సిఐడీ .. ఈడీ.. ఐటీ... ముప్పేట దాడులతో టీడీపీ లో టెన్షన్

ఎవరైనా సంతోషంగా ఇస్తే గిఫ్ట్ రూపంలో తీసుకోవచ్చన్న ఏపీ మంత్రి

ఎవరైనా సంతోషంగా ఇస్తే గిఫ్ట్ రూపంలో తీసుకోవచ్చన్న ఏపీ మంత్రి

లంచాలపై మాట్లాడిన మంత్రి పేర్ని నానీ ఎవరైనా సంతోషంగా ఇస్తే హాయిగా తీసుకోవచ్చు కానీ అలా కాకుండా వేధింపులకు గురి చేసి వసూళ్ళకు పాల్పడటం దారుణం అని పేర్కొన్నారు .
ఉద్యోగులపై జరుగుతున్న ఏసీబీ దాడుల అంశం గురించి సమావేశంలో చర్చ జరిగిన నేపధ్యంలో మంత్రి పేర్ని నానీ లంచాల గురించి మాట్లాడారు. ఎవరైనా సంతోషంగా ఇస్తే గిఫ్ట్ రూపంలో తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

పీక మీద కత్తి పెట్టి లంచం అడగకూడదని పేర్కొన్న పేర్ని నానీ

పీక మీద కత్తి పెట్టి లంచం అడగకూడదని పేర్కొన్న పేర్ని నానీ

అలా కాకుండా పీక మీద కత్తి పెట్టి లంచం అడగకూడదని ఆయన సమావేశంలో మాట్లాడారు . లంచగొండి తనాన్ని లేకుండా చేద్దామని , పారదర్శక పాలన అందిద్దాం అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని తెలిపారు. లంచాలు తీసుకొని పరువు పోగొట్టుకోవద్దని పేర్ని నాని ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి పేర్కొన్నారు . నీతిగా ఉండేవాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. పని చేస్తూ పోతే సంతోషంగా వారు ఏదైనా ఇస్తే గిఫ్ట్ గా ఉంటుందని, అదే పీకమీద కత్తి పెట్టి అడిగితే అది దోపిడి అవుతుందని ఆయన పేర్కొన్నారు.

లంచాలపై మంత్రి వ్యాఖ్యలపై ఏపీలో చర్చ

లంచాలపై మంత్రి వ్యాఖ్యలపై ఏపీలో చర్చ

గిఫ్ట్ ఇస్తే హాయిగా తీసుకోండి.. కానీదోపిడీ చేయొద్దని తన వద్దకు వచ్చిన ప్రతీ ఉద్యోగికీ చెబుతానని పేర్ని నానీ పేర్కొన్నారు . ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే జనాలను లంచాల కోసం ఇబ్బంది పెడితే ఏసీబీ దాడి తప్పదని చెప్పారు. ఇక మంత్రి పేర్ని నాని లంచాలపై ఈ విధంగా స్పందించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంత్రి అయ్యి ఉండి ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోమని ఎలా చెప్తారు అని చర్చించుకుంటున్నారు.

English summary
The transport and public relations minister Perni Nani spoke about bribe in AP employees JAC meeting . He said that the empolyees can be taken comfortably if they give any gift with happy, but it is worse to be abused and charged to bribe .Minister Nani spoke about bribery in the wake of a discussion on the topic of ACB attacks on employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X