• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను కాపాడిన ఉన్మాది చంద్రబాబు: మండిపడిన మంత్రి రోజా

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉదాసీనత వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి అంటూ విజయవాడ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటన నేపధ్యంలో ఆరోపణలు గుప్పించారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాసిన చంద్రబాబు విజయవాడ ఘటనపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వకుంటే చప్పట్లు కొడతామా? వాసిరెడ్డి పద్మ ఫైర్చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన పనికి సమన్లు ఇవ్వకుంటే చప్పట్లు కొడతామా? వాసిరెడ్డి పద్మ ఫైర్

 అత్యాచార ఘటనపై టీడీపీ వర్సెస్ వైసీపీ

అత్యాచార ఘటనపై టీడీపీ వర్సెస్ వైసీపీ


రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి విజయవాడ ఆస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన నిదర్శనమని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు లైంగిక వేధింపులు రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఉన్నారు. ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు రాసిన లేఖపై, విజయవాడ అత్యాచార ఘటనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

చంద్రబాబు ఒక ఉన్మాది: రోజా ఫైర్

చంద్రబాబు ఒక ఉన్మాది: రోజా ఫైర్


టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్.కె.రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒక ఉన్మాది అంటూ మండిపడిన రోజా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆడపిల్లల రక్షణ కోసం చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించిన రోజా, చంద్రబాబుకి ఏం అర్హత ఉందని జగన్ గురించి మాట్లాడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు.

 విశాఖపట్నంలో చంద్రబాబుపై మండిపడిన మంత్రి

విశాఖపట్నంలో చంద్రబాబుపై మండిపడిన మంత్రి


మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విశాఖలో స్వరూపానంద స్వామి ఆశీస్సులతో తీసుకోవడంతోపాటు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి విశాఖపట్నానికి వెళ్ళిన రోజా విశాఖపట్నంలో చంద్రబాబు ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దిశ యాప్ ద్వారా తొమ్మిది వందల మందిని రక్షించడం జరిగిందని పేర్కొన్నారు మంత్రి రోజా. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార ఘటన విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం లో భాగంగా మంత్రి రోజా చంద్రబాబును టార్గెట్ చేశారు.

ఏపీకి అసలు చంద్రబాబు అవసరమే లేదని రోజా వ్యాఖ్యలు


గతంలో చంద్రబాబు పాలనలో ఏపీలో జరిగిన అనేక ఘటనలు ప్రస్తావించిన రోజా మహిళా తహసీల్దార్ ను ఇసుకలో ఈడ్చింది అప్పటి టిడిపి ఎమ్మెల్యే కాదా అంటూ ప్రశ్నించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో నిందితులను కాపాడిన ఉన్మాది చంద్రబాబు నాయుడు అంటూ రోజా ఆరోపణలు గుప్పించారు. ఇక చంద్రబాబు ఏది చెబితే అది నమ్మడానికి జనాలు పిచ్చివాళ్లు కాదంటూ మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబుకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని రోజా పేర్కొన్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయని, ఈసారి ఏపీలో ఆమాత్రం కూడా రావని రోజా ఎద్దేవా చేశారు. కోడలు మగబిడ్డను కంటే బాగుండు అనుకున్న వ్యక్తి చంద్రబాబు, మహిళల పట్ల గొప్పగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని రోజా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు చంద్రబాబు అవసరమే లేదన్నారు రోజా.

English summary
Minister Roja incensed that Chandrababu as Maniac. Roja alleged that Chandrababu Naidu saved the accused in the call money sex racket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X