జగన్ కు లేఖ రాయడంతో పీక్స్ కు చేరిన వివాదం
Minister Satya Kumar: ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిర్మితమైన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చూపించడానికి సిద్దంగా ఉన్నామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు సవాల్ విసురుతోన్నారు.
కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు దమ్ముంటే తమతో వాటిని పరిశీలించడానికి రావాలని డిమాండ్ చేస్తోన్నారు. పేద విద్యార్ధులకు మెడికల్ విద్య, వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే.. చంద్రబాబు వాటిని తనకు కావాల్సిన వారికి తెగనమ్మేందుకు సిద్దపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. దీనిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక కూటమి మంత్రుల ఆయనపై దూషణలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.

ఈ పరిణామాల మధ్య మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తాజాగా వైఎస్ జగన్ కు లేఖ రాశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని జగన్ చెబుతున్నదంతా అబద్దాలేనని తేల్చిచెప్పారు సత్యకుమార్.
రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి కేవలం రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని సత్యకుమార్ పేర్కొన్నారు. వైసీపీ హాయంలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకు రాలేకపోయారని విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై దృష్టి పెట్టిందని వెల్లడించారు. వైఎస్ జగన్ లా కూటమి ప్రభుత్వం విఫలం కాకూడదనే పీపీపీ విధానం ఎంచుకున్నట్లు సత్యకుమార్ తెలియజేశారు.
పీపీపీకీ, ప్రైవేటీకరణకూ చాలా వ్యత్యాసం ఉందని సత్యకుమార్ పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలపై తన వివరణకు వైఎస్ జగన్ దమ్ముంటే స్పందించాలని డిమాండ్ చేశారు. తాము చేయని వాటి గురించి కూడా గత జగన్ ప్రభుత్వం తామే చేశామని చెప్పుకోవడం దారుణం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications