వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు, అందుకే ప్రభుత్వంపై విమర్శలు : మంత్రి వెల్లంపల్లి

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ నేతలు మంత్రులు ఫైర్ అయ్యారు. ఇసుకపై పవన్ కళ్యాణ్ రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అధికారం లేకుండా ఉండ లేక పోతున్నాడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అందుకే అందుకే ఆయన చిరంజీవితో విభేదించి బయటకు వచ్చారని అన్నారు. మరోవైపు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తోక పట్టుకుని తిరిగాడని, ప్రస్తుతం ఆయన కూడ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి బీజేపీపై పడిందని అన్నారు. కాగా పవన్ కళ్యాణ్ చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి తెలిపారు.

పవన్ పై విమర్శల స్పీడు పెంచిన మంత్రులు

పవన్ పై విమర్శల స్పీడు పెంచిన మంత్రులు


ఇటివల జనసేన పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శల స్పీడు పెంచారు. ప్రతి రోజు పవన్ కళ్యాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండడంతో వైసీపీ నేతలు, మరియు మంత్రులు సైతం తమ గళాన్ని విప్పుతున్నారు. ఈనేపథ్యంలోనే పవన్ కళ్యాన్‌పై విమర్శల దాడిని చేస్తున్నారు. తాజాగా పవన్ పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. జగన్ ను విమర్శిస్తే ప్రజలు ఆదరిస్తారనే భ్రమలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని అన్నారు.

వరదలో ఇసుక ఎలా తీయాలో పవనే చెప్పాలి

వరదలో ఇసుక ఎలా తీయాలో పవనే చెప్పాలి

ఇసుక రవాణపై పవన్ అనవసరంగా మాట్లాడుతున్నారని అన్నారు. గత యాబై రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవడంతో వరద వస్తుందని.. వరదలో ఇసుకను ఎలా తీయాలో పవన్ కళ్యాణ్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇక నాణ్యమైన ఇసుకను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అయితే నూతనంగా తీసుకువచ్చి పథకంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుందని, అవి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్టు కాదని అన్నారు.

 గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇసుక దోపిడి

గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇసుక దోపిడి

మరోవైపు పవన్ ఇష్టమచ్చినట్టుగా మాట్లాడుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ప్రత్యేక హోదాపై ఒక్కసారి కూడ నోరుమెదపని పవన్ కళ్యాణ్ ఇసుక అంశంపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక గత ఐదేళ్లలలో విచ్చలవిడిగా ఇసుక దోపిడి జరిగింది. అయితే ఒక్కసారి కూడ పవన్ కళ్యాణ్ స్పందించ లేదని కాని ఇప్పుడు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన పైర్ అయ్యారు.

English summary
Minister Vellampalli Srinivas fires on Janasena chief Pawan Kalyan. He criticizing his lack of information on sand crisis he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X