వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమిలి ఎన్నికలపై చంద్రబాబువి పగటి కలలు : ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

|
Google Oneindia TeluguNews

త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు కలలు కంటున్నారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు జమిలి ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు రోజుకు ఒక విషయాన్ని తెర మీదకు తీసుకు వస్తారని, అందులో భాగంగానే జమిలి ఎన్నికల అంశాన్ని చంద్రబాబు మాట్లాడుతున్నాడని ఆయన పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసం చంద్రబాబుకు వేరే మార్గం లేకనే జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకు వస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని చంద్రబాబు విఫల యత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు వస్తున్నాయి అనేది కేవలం ప్రచారం మాత్రమేనని తెలిపారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

 minister vellampalli srinivas says chandrababu is in daydreams about jamili elections

ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామంటూ పేర్కొన్నారు.

టీడీపీకి ఇప్పుడు వచ్చిన 23 స్థానాలలో ఒక్క చోట కూడా సీట్లు రావని ఆయన తెలిపారు. కుప్పంలో చంద్రబాబు డిపాజిట్లు గల్లంతు చేస్తామని, 175 స్థానాల్లో ఒక స్థానంలో కూడా టిడిపి విజయం సాధించదని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో మరోమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అంతేకాదు జమిలి ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని, 2024లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన తేల్చి చెప్పారు

Recommended Video

T Journalist Forum: కాళేశ్వరం ఒక్కటే వరప్రదాయిని కాదు, తెలంగాణ పెండింగ్‌ ప్రాజెక్టులుపై భేటీ !

.

English summary
AP endowment Minister Vellampally Srinivas has criticized Chandrababu for dreaming of Jamili election soon. He said that Chandrababu was already daydreaming that he had already made comments several times that Jamili elections would come. He said that Chandrababu would bring one thing to the screen to divert the attention of the people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X