చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుద్ధి చెప్తాం: శివప్రసాద్‌కు మంత్రుల హెచ్చరిక, మంత్రి పదవులు అంటే..

తెలుగుదేశం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు మంత్రులు నక్కా ఆనంద్ బాబు, అమర్నాథ్ రెడ్డిలు శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు మంత్రులు నక్కా ఆనంద్ బాబు, అమర్నాథ్ రెడ్డిలు శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు.

బొజ్జల ఎఫెక్ట్, 2019 భయం: బాబుపై శివప్రసాద్ ఆగ్రహం వెనుక మరో కోణంబొజ్జల ఎఫెక్ట్, 2019 భయం: బాబుపై శివప్రసాద్ ఆగ్రహం వెనుక మరో కోణం

ఇటీవలి మంత్రి వర్గ విస్తరణలో ఎస్పీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని శివప్రసాద్ వ్యాఖ్యానించడం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపింది.

బుద్ధి చెప్తాం

బుద్ధి చెప్తాం

ఆయన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు. వ్యక్తిగత అజెండాతో మాట్లాడటం సరికాదని, రాజకీయ విమర్శలు మానుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని మంత్రి నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు.

దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్దితో పని చేస్తోందని, దళితవాడల్లో వేల కోట్ల రూపాయలతో సిమెంటు రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు.

తెలియకుండా మాట్లాడవద్దు

తెలియకుండా మాట్లాడవద్దు

తెలిసీతెలియకుండా మాట్లాడటం, రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. టిడిపి హయాంలోనే దళిత వాడల్లో ఎనలేని అభివృద్ధి అన్నారు. 126 అడుగుల విగ్రహంతో అంబేడ్కర్‌ను గౌరవిస్తున్నారన్నారు.

మంత్రి పదవులు సీఎం ఇష్టం

మంత్రి పదవులు సీఎం ఇష్టం

మంత్రి పదవులు ఇవ్వడం అధిష్ఠానం ఇష్టమని మరో మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. వేదికపై రాజకీయాలు మాట్లాడవద్దని, మంత్రి పదవులు ఇవ్వడమనేది రాజ్యాంగం లేదా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చేసే కార్యక్రమం అన్నారు.

మంత్రి ఎవరు అయినా..

మంత్రి ఎవరు అయినా..

దళితులకు మంత్రి పదవి వచ్చినా, తనకు వచ్చిన దళితుల అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఎవరికైనా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగపరంగా చెందాల్సిన ఫలాలు వారికి చెందడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ ఫలాలు వారికి అందడానికి సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకొని పని చేస్తున్నారన్నారు.

English summary
Ministers Nakka Anandd Babu and Amarnath Reddy give counter to Chittoor MP Sivaprasad over his comments on Party High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X