అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ బహిష్కరణ: 'పేరు వస్తుందనే, జగన్‌కు సొంత ఎమ్మెల్యేల భయం'

వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మంత్రులు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసిపి నిర్ణయించింది.ఈ నేపథ్యంలో వారు స్పందించ

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మంత్రులు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసిపి నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో వారు స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వాటిపై సమాధానం చెప్పలేక బహిష్కరించారని ఇప్పటికే మంత్రి పత్తిపాటి ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేలు మాట్లాడి పేరు తెచ్చుకుంటారని జగన్ భయం

ఎమ్మెల్యేలు మాట్లాడి పేరు తెచ్చుకుంటారని జగన్ భయం

తాను అసెంబ్లీలో లేకుంటే తన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడి గుర్తింపు తెచ్చుకుంటారన్న ఆందోళన జగన్‌లో కనిపిస్తోందని, అందుకే తాను లేని సమయంలో వారు సభకు వెళ్లకుండా ఉండేందుకు సమావేశాలను బహిష్కరించారని టిడిపి నేత పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.

ఇంటింటికి తిరిగినా 16 శాతం ఓట్లతో ఓటమి

ఇంటింటికి తిరిగినా 16 శాతం ఓట్లతో ఓటమి

పాలక, ప్రతిపక్ష పాత్రలను రాష్ట్రంలో టిడిపినే పోషిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టిడిపి పాలనను ప్రజలు మెచ్చుకుంటే జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నంద్యాల ఎన్నికల్లో జగన్ గడపగడపకు తిరిగినా 16 శాతం ఓట్లతో ఓడిపోయారన్నారు.

ఏం చర్చించాలో తెలియక బహిష్కరణ

ఏం చర్చించాలో తెలియక బహిష్కరణ

జగన్ విపక్ష నేతగా విఫలమయ్యారని మంత్రి జవహర్ అన్నారు. అసెంబ్లీలో ఏం చర్చించాలో తెలియక సమావేశాలు బహిష్కరించారన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్ పాదయాత్ర చేస్తున్నారని, పాప పరిహారం కోసం జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు.

జగన్‌కు పాదయాత్ర చేసే అర్హత లేదు

జగన్‌కు పాదయాత్ర చేసే అర్హత లేదు

జగన్‌కు పాదయాత్ర చేసే అర్హత లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చేసిన పాపాలే జగన్‌కు శాపాలుగా మారాయన్నారు. ఎంపీలతో లేఖలు రాయించి కేంద్ర నిధులు రాకుండా చేసే ప్రయత్నం చేశారని మండిడ్డారు.

English summary
The main opposition YSR Congress party said on Thursday it will boycott all forthcoming sessions of the Andhra Pradesh assembly if all 20 of its MLAs, who defected to the ruling Telugu Desam Party, are not disqualified immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X