వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మంత్రుల గుస్సా.. ఏకపక్షంగా నిర్ణయం అని ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌పై రగడ నెలకొంది. ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతుతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆరోపించారు. డిపాజిట్లు కోల్పోయిన వారికి సాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

పంచాయతీ పోరుకు ముహూర్తం పెట్టేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన... ఉప సర్పంచి ఎన్నిక జరుగుతుందని తెలిపారు. శనివారం నుంచే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అయితే నిమ్మగడ్డ నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ministers slams sec nimmagadda ramesh kumar

ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తప్పుబట్టారు. నిమ్మగడ్డ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై హౌస్ మోషన్ పిటిషన్‌ వేస్తామని బాలినేని ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు, అధికార పార్టీ నేత వ్యతిరేకిస్తున్నారు.

ఫిబ్రవరి 5, 7, 9, 17న దశలవారీగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. చివరి దశ పోలింగ్ రోజునే సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ను సాకుగా చూపుతూ రాష్ట్ర సర్కారు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలనుకుంటోందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు.

English summary
andhra pradesh ministers slams sec nimmagadda ramesh kumar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X