వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ 2024: వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ అక్కడ నుండే..రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత ఎన్నికల్లో పోటీ చేసి చావు దెబ్బ తింది జనసేన పార్టీ. 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేసిన జనసేన పార్టీ అన్ని నియోజ వర్గాల నుంచి పోటీ చేసినా కేవలం ఒక్క ప్లేస్ లో మాత్రమే విజయం సాధించింది. ఎంతో ప్రభావం చూపిస్తుంది అనుకున్న జనసేన ఎలాంటి ప్రభావం చూపించకుండా కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావటం జనసేన వర్గాలనే కాదు అటు ప్రజలను సైతం షాక్ కు గురి చేసింది . ఇక గత అనుభవాల దృష్టితో మిషన్ 2024కు ఇప్పటి నుండే పవన్ కసరత్తు మొదలు పెట్టారని తెలుస్తుంది .

జగన్ ప్రజల్ని నమ్మించి గొంతు కోశారు : జనసేన అధినేత పవన్‌‌కళ్యాణ్‌జగన్ ప్రజల్ని నమ్మించి గొంతు కోశారు : జనసేన అధినేత పవన్‌‌కళ్యాణ్‌

భీమవరం, గాజువాకలలో గత ఎన్నికల్లో పవన్ పరాజయం

భీమవరం, గాజువాకలలో గత ఎన్నికల్లో పవన్ పరాజయం

ఇక ఏపీలో గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తే కేవలం రాజోలు నియోజకవర్గం నుండి మాత్రమే జనసేన విజయం సాధించింది . రాజోలు నుండి రాపాక వరప్రసాద్ విజయం సాధించినా ఆయన పార్టీ ఎమ్మెల్యేలా మాత్రం వ్యవహరించటం లేదు. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. ఊహించని విధంగా ఆయన పరాజయం పాలయ్యారు. ఒక్క ప్రాంతం నుంచి పోటీ చేసి ఉంటె పవన్ గెలిచేవారనే అభిప్రాయం సైతం ప్రజల్లో ఉంది .

రెండు చోట్ల పోటీ చెయ్యటం పవన్ కు మైనస్

రెండు చోట్ల పోటీ చెయ్యటం పవన్ కు మైనస్

ఇక పవన్ కళ్యాణ్ కు రెండు చోట్ల నుంచి పోటీ చేయడం వలన రెండు ప్రాంతాల వాళ్ళు పెద్దగా ఆయనకు ఓటు వేయలేదు. కారణం గాజువాకలో వెయ్యకున్నా భీమవరంలో గెలుస్తాడని , భీమవరంలో వెయ్యకున్నా గాజువాక వాళ్ళు వేస్తారని భావించటమే కాకుండా జనసేన పార్టీ ఎన్నికల్లో మార్పు కోసం ప్రలోభాలకు గురి కాకుండా ఓటేసే వ్యవస్థ కోసం ప్రయత్నం చేసింది. ఫలితంగా ఓటమి చవిచూసింది.

 తాడేపల్లి గూడెం నుండి పవన్ పోటీ చేసి ఉంటె గెలిచేవారని టాక్

తాడేపల్లి గూడెం నుండి పవన్ పోటీ చేసి ఉంటె గెలిచేవారని టాక్

అయితే, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక ప్రాంతాల నుంచి కాకుండా మరో కొత్త ప్రాంతం నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు ఇప్పటినుండే వస్తున్నాయి . అసలు పవన్ గత ఎన్నికల్లోనే ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేయాల్సి ఉండగా అనుకోకుండా గాజువాక, భీమవరం నుండి పోటీ చేశారు . అసలు పవన్ ముందు అనుకున్నట్టు తాడేపల్లి గూడెం నుండి పోటీ చేసి ఉంటె తప్పకుండా పవన్ గెలిచేవారని తెలుస్తుంది . నేతలు సూచనల మేరకు ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఊహించని పరాజయం పొందారు .

వచ్చే ఎన్నికల్లో తాడేపల్లి గూడెం నుండి పవన్ పోటీ .. ఇప్పటి నుండే వ్యూహం

వచ్చే ఎన్నికల్లో తాడేపల్లి గూడెం నుండి పవన్ పోటీ .. ఇప్పటి నుండే వ్యూహం

అయితే, వచ్చే ఎన్నికల్లో పవన్ తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం . అందుకోసం ఆయన ఇప్పటి నుండే మిషన్ 2024 మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది .దీని కోసం ఇప్పటి నుండే తాడేపల్లి గూడెం నియోజక వర్గం మీదనే ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారని సమాచారం . తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలిచే అవకాశం ఉన్నట్టుగా సర్వే ద్వారా తెలియడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని టాక్ వినిపిస్తుంది . ఇక వచ్చే ఎన్నికలలో గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారని టాక్ .

English summary
Reliable information that Pawan has decided to contest from Tadepalli gudem in the next election. It is known that he will start the mission 2024 from now onwards . Talk is heard that Pawan will make the decision as he is informed by a survey that he is likely to win from Tadepalligudem..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X