హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిలను లాగుతారా.. మనిషేనా, నా వద్దకు రండి కత్తితో దాడి చేస్తే ఏమౌతుందో చూపిస్తా: మిథున్

|
Google Oneindia TeluguNews

అమరావతి: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై తెలుగుదేశం పార్టీలు విచిత్రంగా స్పందిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి మంగళవారం అన్నారు. మెడపై దాడి జరిగితే ఏమీ కాదని చెప్పేవారు తన వద్దకు రావాలని ఆయన సవాల్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తానన్నారు.

<strong>అతను సీఎం సన్నిహితుడు, గడ్డి తింటున్నారా: రోజా, చంద్రబాబు-డీజీపీ కాల్ డేటా రావాలి: ఆర్కే</strong>అతను సీఎం సన్నిహితుడు, గడ్డి తింటున్నారా: రోజా, చంద్రబాబు-డీజీపీ కాల్ డేటా రావాలి: ఆర్కే

 నా వద్దకు వస్తే మెడపై కత్తితో...

నా వద్దకు వస్తే మెడపై కత్తితో...

ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. చిన్న ఆయుధం ఏమీ కాదని చెబుతున్నారని, చిన్న కత్తి అంటున్నారని, అలా చెప్పేవారు తన వద్దకు వస్తే మెడపై అదే కత్తితో పొడుద్దామని, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అలా చేస్తే ఏకంగా పైకి వెళ్లిపోతారని చెప్పారు. కానీ ఏం జరగదని చెప్పడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు.

Recommended Video

జగన్‌పై దాడి ఆరోజే ఎందుకు? | Why Srinivas Rao Did That Attempt Ys Jagan on that day only?
రిమాండ్ రిపోర్టులో ఉంది

రిమాండ్ రిపోర్టులో ఉంది

మెడకు గాయం కాకపోవడంతో జగన్ అదృష్టవశాత్తూ బయటపడ్డారని, అది హత్యాయత్నమేనని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని మిథున్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల మాటలు చూస్తుంటే కుట్ర కోణం ఉందనే అనుమానం మరింత బలపడుతుందని చెప్పారు. జరిగిన ప్రమాదం తమ పరిధిలో లేదని ఏపీ పోలీసులు చెప్పడం ఏమిటన్నారు.

షర్మిలను, విజయమ్మను లాగడంపై

షర్మిలను, విజయమ్మను లాగడంపై

జగన్ పైన దాడి ఘటనలోకి షర్మిలను, విజయమ్మను లాగడంపై మిథున్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక మనిషికి చెల్లిపై, తల్లిపై అనుమానం వచ్చిందంటే వాడు మనిషే కాదని, ఇలాంటి మనుషులు కూడా రాజకీయాల్లో ఉన్నారా అనిపిస్తోందని, వారి పేరు ఎత్తాలంటేనే తనకు అసహ్యం వేస్తోందని చెప్పారు. తనపై దాడి ఘటనపై జగన్ ఏం మాట్లాడలేదని అంటున్నారని, కాని అధికార ప్రతినిధి మాట్లాడటం అంటే జగన్ మాట్లాడినట్లే అన్నారు.

 రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన బీజేపీ నేతలు

రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన బీజేపీ నేతలు

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఏపీ బీజేపీ నేతలు మంగళవారం కలిశారు. టిట్లీ తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకోవాలని, విపత్తు సహాయనిధి నుంచి తక్షణమే సాయం చేయాలన్నారు. జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై విచారణ జరిపించాలని కోరారు. ఎమ్మెల్సీ మాధవ్‌, విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి రఘురాం తదితరులు ఆయనను కలిశారు.

English summary
YSR Congress Party leader Mithun Reddy fires at TDP leaders for dragging Sharmila and YS Vijayamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X