వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లీడర్లైనా, అధికారులైనా లెక్కలు తీసుడే.. ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఎమ్మెల్యే ఆళ్ల

|
Google Oneindia TeluguNews

గుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పని మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుడు లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు. ఆదివారం నాడు జరిగిన జడ్పీ సమావేశంలో పాల్గొన్న ఆళ్ల పలు అంశాలు ప్రస్తావించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలపై విజలెన్స్ విచారణకు అదేశించాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వచ్చాయి? ఎంత ఖర్చు చేశారు అనే లెక్కలు తేల్చాల్సి ఉందని డిమాండ్ చేశారు. అధికారులు బాగా పనిచేస్తే సన్మానం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

Recommended Video

ప్రజావేదిక వివాదంపై..ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
mla alla ramakrishna reddy warns that officials and tdp leaders

ప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలుప్రజావేదికపై రాద్దాంతం ఎందుకో.. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి.. టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి చురకలు

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చేసినట్లు తెలిస్తే లీడర్లైనా, అధికారులైనా ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. ఎవరైనా సరే లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎవరు చేసినా చేయకపోయినా తాను మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తానని.. కచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

అదలా ఉంటే.. సరిగ్గా పది రోజుల్లో లెక్కలను పూర్తిగా బయటికి తీసి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను హోం మంత్రి మేకతోటి సుచరిత ఆదేశించడం గమనార్హం.

English summary
YCP MLA Alla Ramakrishnareddy warns the government officials and tdp leaders that taken action against who made mistakes earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X