వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5గురు డుమ్మా: జగన్‌కు షాక్, అదే 'అసంతృప్తి'తో టిడిపిలోకి అమర్నాథ్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీలో మరో షాక్ తగలనుంది. మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం బెజవాడలో జరిగిన కీలక సమావేశానికి హాజరు కాలేదు.

బాబు జిల్లాలో జగన్‌కు తొలి షాక్: టీడీపీలోకి అమర్నాథ్, అదే అసంతృప్తి?బాబు జిల్లాలో జగన్‌కు తొలి షాక్: టీడీపీలోకి అమర్నాథ్, అదే అసంతృప్తి?

అమర్నాథ్ రెడ్డితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి కూడా గైర్హాజరయ్యారు. మిగతా వారు హాజరు కాకపోవడానికి గల కారణాలను వారు అంతకుముందే జగన్‌కు తెలియజేశారని తెలుస్తోంది.

అయితే అమర్నాథ్ రెడ్డి తన గైర్హాజరీకి సంబంధించి పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గడచిన ఎన్నికలకు ముందు టిడిపిలో ఉన్న అమర్నాథ్ రెడ్డి ఎన్నికల అనంతరం వైసీపీ విపక్షానికే పరిమితం కావడం, పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ బాట పట్టడంతో సైకిల్ ఎక్కాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

 MLA Amarnath Reddy absent in YSR Congress party meeting

ఈ మేరకు ఇప్పటికే ఆయన టీడీపీ కీలక నేతలను కలిసినట్లు కూడా సమాచారం. మంగళవారం బెజవాడలో జరిగిన కీలక భేటీకి హాజరుకాకపోవడం, గైర్హాజరీకి కారణాలు తెలపకపోవడంతో అమర్నాథ్ రెడ్డి వైసీపీ చేజారిపోయినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. త్వరలోనే ఆయన టిడిపిలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.

టిడిపిలో చేరుతున్నా: అమర్నాథ్ రెడ్డి

తాను టిడిపిలో చేరుతున్నట్లు మంగళవారం మధ్యాహ్నం అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. మొదటి నుంచి జగన్‌కు, పార్టీకి అండగా ఉన్న అమర్నాథ్ రెడ్డి పార్టీని వీడటంపై చర్చ జరుగుతోంది. పీఏసీ చైర్మన్ పదవి
కారణంగానే అమర్నాథ్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తోంది.

భూమా నాగిరెడ్డి పార్టీ వీడాక పీఏసీ చైర్మన్ పదవిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జ్యోతుల నెహ్రూ పార్టీని వీడారు. అదే అసంతృప్తితో అమర్నాథ్ రెడ్డి పార్టీని వీడుతుండటం గమనార్హం. అమర్నాథ్ రెడ్డితో వైసిపిని వీడిన వారి సంఖ్య సరిగా ఇరవైకి చేరుకుంటుంది.

English summary
MLA Amarnath Reddy absent in YSR Congress party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X