కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనిల్ కుమార్ v/s ఎమ్మెల్యే ఆర్థర్: కర్నూలులో అడుగుపెట్టలేవని మంత్రికి ఎమ్మెల్యే అనుచరుల వార్నింగ్

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లా వైసీపీలో విభేదాలు దగ్గుమన్నాయి. నందికొట్కారు ఎమ్మెల్యే అర్థర్ అనుచరులు నియోజకవర్గ ఇంచార్జీ సిద్దార్థ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నందికొట్కూరు వ్యవహారాలు పట్టించుకోవడం మానేయాలని, లేదంటే కర్నూలు జిల్లాలో తిరగనీయమని హెచ్చరికలు జారీచేశారు. ఎమ్మెల్యే అర్థర్ అనుచరుడు మంత్రి అనిల్ కుమార్‌పై బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. తీరు మార్చుకోవాలని, లేదంటే జిల్లాలో అడుగు పెట్టనీయమని వార్నింగ్ ఇచ్చారు.

నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం జగన్‌... జెట్ స్పీడ్ తో పనులునేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం జగన్‌... జెట్ స్పీడ్ తో పనులు

ఆర్థర్ వర్సెస్ సిద్దార్థరెడ్డి

ఆర్థర్ వర్సెస్ సిద్దార్థరెడ్డి

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ ఇంచార్జీ సిద్ధార్థరెడ్డి మధ్య దూరం పెరుగుతోంది. దీనికి తగట్టు ఆర్థర్ నియమించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్యానెల్ సభ్యులను సిద్ధార్థరెడ్డి అడ్డుకొంటున్నారు. దీంతో వీరి మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో ఆర్థర్‌కు చెక్ పెడుతూ సిద్ధార్థరెడ్డి వస్తోన్నారు. దీంతో ఆర్థర్ వర్గం రగిలిపోతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీని యథావిధిగా కొనసాగించాలని కోరుతోంది. ఉన్న సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని అల్టిమేటం జారీచేసింది. లేదంటే జిల్లాలో తిరగనీయబోమని వార్నింగ్ ఇచ్చింది.

నెల్లూరు కాదు..

నెల్లూరు కాదు..

మార్కెట్ కమిటీని కొనసాగించకుంటే ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో తిరగనీయకుండా చేస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. రాజకీయాలు చేయాలనుకుంటే నెల్లూరు జిల్లాలో చేయాలే తప్ప.. కర్నూలులో కాదని హితవు పలికారు. డాబు, దర్పం సొంత జిల్లాలో చూపించాలని.. ఇంచార్జీ మంత్రిగా ఉన్న కర్నూలులో కాదన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ బాడీ చేంజ్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఫైరయ్యారు. తమ ప్రతాపం ఏంటో చూపిస్తామని తమదైన శైలిలో రెచ్చిపోయారు.

Recommended Video

3 Minutes 10 Headlines | National Science Day | Saudi Halts Travel To Mecca, Medina| Oneindia Telugu
ఇదీ కారణం

ఇదీ కారణం

నందికొట్కూరులో ఆర్థర్, సిద్ధార్థరెడ్డి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలో తన అనుచరులకు ఆర్థర్ స్థానం కల్పించారు. అయితే దీనిని సిద్ధార్థరెడ్డి అడ్డుకోవడంతో విభేదాలు భగ్గుమన్నాయి. సిద్ధార్థ రెడ్డికి జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అండదండలు ఉన్నాయి. నియోజకవర్గంలో సిద్ధార్థరెడ్డి ఆటలు కొనసాగనీయొద్దంటే మంత్రి అనిల్ కుమార్‌కు చెక్ పెట్టాలని ఆర్థర్ అనుచరులు భావించారు. ఓ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న వీడియో బయటకు వచ్చింది. అందులో సిద్ధార్థరెడ్డితోపాటు మంత్రి అనిల్ కుమార్‌కు ఆర్థర్ అనుచరులు హెచ్చరికలు జారీచేశారు.

English summary
mla arthur supporters warning to minister anil kumar yadav on constituency issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X