వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే బాలకృష్ణ సాయం, నియోజకవర్గంలో పేదలకు కూరగాయాల పంపిణీ, బయటకు వెళ్లొద్దని..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ.. ఇంట్లోనే ఉందామని నేతలు పిలుపునిస్తున్నారు. మరికొందరు సరుకులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఆర్థికసాయం కూడా చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు కూరగాయాలు పంపిణీ చేశారు.

రోజు గడవలాంటే సరుకులతోపాటు విజిటేబుల్స్ తప్పనిసరి. పేదలకు ప్రభుత్వం రేషన్ ఇస్తున్నందున.. ప్రజలకు కూరగాయాలు ఇవ్వాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. హిందూపురంలో తన అనుచరుడు అంబికా లక్ష్మినారాయణకు కూరగాయాల పంపిణీ బాధ్యతలు అప్పగించారు. బాలకృష్ణ ఆదేశాల మేరకు మంగళవారం లక్ష్మినారాయణ కూరగాయాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ఎమ్మెల్యే రోజా చేసిన వీడియో పై బండ్ల గణేష్ ట్వీట్... అసలు విషయం ఏంటంటేఎమ్మెల్యే రోజా చేసిన వీడియో పై బండ్ల గణేష్ ట్వీట్... అసలు విషయం ఏంటంటే

mla balakrishna distribute vegetables to people

వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని బాలకృష్ణ కోరారు. వారికి అవసరమైన కూరగాయాలను అందచేస్తున్నామని వివరించారు. పేదల ఇంటింటికి వెళ్లి లక్ష్మీనారాయణ కూరగాయాలను అందజేశారు. విజిటేబుల్ ఇచ్చి బయటకు వెళ్లొద్దని కోరారు. అత్యవసరం ఉంటే తప్ప గడప దాటొద్దని సూచించారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో తమ సూచనకు స్థానికులు సానుకూలంగా స్పందించారని లక్ష్మినారాయణ పేర్కొన్నారు.

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. సోమవారం నాటికి 23 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ 17 కేసులు కూడా ఇటీవల ఢిల్లీలో మత సభలకు హాజరైన వారు, వారి నుంచి సోకిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మత సభలకు 800 మంది వరకు వెళ్లారు. వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు అధికారులు. వారు ఎవరెవరిని కలిశారు, వారి ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీస్తున్నారు.

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu

English summary
coronavirus effect: hindupuram mla balakrishna distribute vegetables to poor people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X