విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రికార్డింగ్ డ్యాన్సుల వివాదంలోకి చింతమనేని..

|
Google Oneindia TeluguNews

విజయవాడ : గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, అంగన్ వాడీ మహిళలతో అసభ్య వ్యాఖ్యలు, అటవీ శాఖ సిబ్బంధి పట్ల దురుసుగా వ్యవహరించి వివాదాల్లో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా మరో వివాదంతో వార్తల్లోకి ఎక్కారు.

అయితే ఈసారి రికార్డింగ్ డ్యాన్సుల వంతు. తిరునాళ్ల సందర్భంగా కృష్ణా జిల్లాలోని చాట్రాయి మండల పరిధిలోని ఆరుగొనుపేటలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. బుధవారం రాత్రి ఈ తాజా వివాదం చోటు చేసుకున్నట్టుగా సమాచారం.

mla chintamaneni

రికార్డింగ్ డ్యాన్సుల విషయం తెలుసుకున్న పోలీసులు, హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో.. విషయాన్ని ఎమ్మెల్యే చింతమనేనికి చేరవేశారు రికార్డింగ్ డ్యాన్స్ ను ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు. దీంతో అక్కడికి చేరుకున్న చింతమనేని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజలే ఇష్టపూర్వకంగా రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మధ్యలో మీ ప్రమేయం ఎందుకంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రికార్డింగ్ డ్యాన్సులను ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని పోలీసులకు సవాల్ చేశారు. దీంతో అటు టీడీపీ కార్యకర్తలు ఇటు పోలీసులు మధ్య కొద్దిసేపు ఉద్రిక్త నెలకొంది. అయితే వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

దీంతో కాస్త వెనక్కి తగ్గిన చింతమనేని, విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అక్కడే తేల్చుకుందామంటూ పోలీసులను హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

English summary
tdp mla chintamaneni again in controversy issue that record dancing take place in krishna district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X