వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడారి హత్య ఘటన: ఎస్సై నిర్లక్ష్యమే కారణం..వేటు వేసిన డీజీపీ

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అత్యంత దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు తమ వెంట ఎస్కార్ట్‌గా వచ్చి ఉంటే కిడారి సోమల ప్రాణాలు దక్కేవేమోనని బంధువులు చెబుతున్నారు. ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు తమ వెంట రాలేదని నిర్లక్ష్యంతో వ్యవహరించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం డుంబ్రిగూడ ఎస్సై అమ్మనరావును సస్పెండ్ చేసింది. కిడారి, సోమల హత్యల తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని ప్రాథమిక విచారణలో తేలడంతో వీరిపై వేటు వేసినట్లు ఏపీ డీజీపీ ఠాకూర్ తెలిపారు.

ఆ ఎమ్మెల్యేలకు ఎరవేసి చంపేశారటఆ ఎమ్మెల్యేలకు ఎరవేసి చంపేశారట

పోలీసుల నిర్లక్ష్యంతోనే కిడారి, సోమలు తమకు కాకుండా పోయారని వారి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై అనుచరులు దాడి చేశారు. డుంబ్రిగూడ ఎస్సై అమ్మనరావు నిర్లక్ష్యం వహించడంతో కిడారి, సోమలపై మావోలు దాడి చేసి హత్యచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఔట్ పోస్ట్‌ను తగలబెట్టారు. ఫర్నీచర్, ఫైళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు చావబాదారు.

MLA Kidari Murder case: Dumbriguda S.I suspended on the grounds of negligency

ఇదిలా ఉంటే మావోయిస్టుల చర్యలకు నిరసనగా ప్రజాసంఘాలు నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో అరకులో వాహనాల రాకపోకలు నలిచిపోగా.. దుకాణాలు మూతపడ్డాయి. టీడీపీ నేతల హత్యతో అరకులో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేసి.. భారీగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యకర్తలను, అభిమానులను నిలువరించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను దింపుతున్నట్లు అధికారులు వెల్లంచారు.

MLA Kidari Murder case: Dumbriguda S.I suspended on the grounds of negligency

English summary
After the attack by Maoists on Araku MLA Kidari Sarveshwar rao and ex mla Soma, violence took place in the valley. Followers of Kidari alleged that if the Police had escorted then Kidari would have escaped. The angry followers attacked the police station and thrashed the police. After carefully assesing the situation DGP Tagore sacked Dumbriguda S.I on the grounds of negligence despite the MLA informing him to give security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X