• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వారు నోరువిప్పుతారనే .. కుడితిలో పడ్డ ఎలుకల్లా చంద్రబాబు,లోకేష్ లు : రోజా ఫైర్

|

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ పై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సెటైర్లు వేస్తున్నారు. చిన్న అవకాశం దొరికినా చంద్రబాబును, నారా లోకేష్ ను తూర్పారబట్టే రోజా తాజాగా టీడీపీ నేతల అరెస్ట్ లతో చంద్రబాబు, లోకేష్ లకు టెన్షన్ పట్టుకుందని, నిద్ర కూడా పట్టటం లేదని వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో ఏపీలో కరోనా కేసులు పెరగటానికి పక్క రాష్ట్రాలే కారణం అని సంచలనవ్యాఖ్యలు చేశారు రోజా.

వైసీపీలో రోజా ఒక ఐటమ్ సాంగ్ ..16 నెలలుగా జైల్లో జగ్గూ సీరియల్ : దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు

చంద్రబాబు,లోకేష్ ల ఉరుకులు పరుగులు అందుకే

చంద్రబాబు,లోకేష్ ల ఉరుకులు పరుగులు అందుకే

టిడిపి నేతలు అచ్చెన్నాయుడు,జెసి ప్రభాకర్ రెడ్డి అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయారు అని పేర్కొన్న రోజా వాళ్లు నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్ ల బండారం బయటపడుతుందని ద్వజమెత్తారు. అందుకే చంద్రబాబు,లోకేష్ లకు టెన్షన్ పట్టుకుందని రోజా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ బాబు లు కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. ఎక్కడ జెసి ప్రభాకర్ రెడ్డి, అచ్చెన్నాయుడు నోరు విప్పుతారో అని భయపడుతూ అటు విజయవాడకు ,అనంతపురానికి పరుగులు పెడుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు

వారి గుట్టు బయటపెడతారనే బాబు,లోకేష్ ల భయం

వారి గుట్టు బయటపెడతారనే బాబు,లోకేష్ ల భయం

జేసీ ప్రభాకర్ రెడ్డిని,అచ్చెన్నాయుడుని బుజ్జగించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అందుకే అండగా ఉన్నామంటూ ఆందోళనలు చేయిస్తున్నారని, ఎక్కడ వారి మనసు మారి అప్రూవర్ గా మారి గుట్టు బయట పెడతారో అని చంద్రబాబుకు టెన్షన్ గా ఉందని రోజా పేర్కొన్నారు. అందుకే అనంతపురానికి వెళ్ళి మరీ లోకేష్ పరామర్శలని మండిపడ్డారు. తాము నిప్పు అని చెప్పుకునే టిడిపి నేతలు, నిప్పులని నిరూపించుకోవాలి కానీ కక్షసాధింపు చర్యలని మాట్లాడడం సిగ్గుచేటని రోజా ఫైర్ అయ్యారు.

జనాలకు భరోసా ఇవ్వటానికి వీలు కాని బాబు ఇప్పుడెలా తిరుగుతున్నారో

జనాలకు భరోసా ఇవ్వటానికి వీలు కాని బాబు ఇప్పుడెలా తిరుగుతున్నారో

కరోనా వైరస్ తో జనం అల్లాడుతున్నారు అని చంద్రబాబు ప్రజలకు కనీసం ఒక్క రోజు కూడా తాము అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నుంచి రావడానికి అనుమతి లేదని చెప్పుకున్న చంద్రబాబు మరి ఇప్పుడు ఎలా వచ్చారని రోజా నిలదీశారు. ప్రజలకు భరోసా ఇవ్వడానికి వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళితే నిబంధనలు పాటించలేదని నోటికొచ్చినట్టు మాట్లాడారంటూ ఆమె మండిపడ్డారు. చంద్రబాబునాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

  అవినీతి చేసిన ఎవ్వరినీ వదలము.. RK ROJA వార్నింగ్
   ఏపీలో కరోనాకేసులు పెరగడానికి పక్క రాష్ట్రాలే కారణం

  ఏపీలో కరోనాకేసులు పెరగడానికి పక్క రాష్ట్రాలే కారణం

  ఇక అంతేకాదు ఏపీలో కరోనా కేసులు పెరగడానికి పక్క రాష్ట్రాలే కారణమని రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు చేయడం లేదని ఆరోపించిన రోజా, పాజిటివ్ కేసులు నమోదు అయిన వారిని పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల నుండి తరిమేస్తున్నారు అని విమర్శించారు. ఆయా ప్రాంతాల నుండి ఏపీకి వస్తున్న వారివల్లే కేసులు పెరుగుతున్నాయని రోజా వ్యాఖ్యానించారు. ఇక అంతే కాదు గ్రామాలలో కొత్త ఎవరైనా కనిపిస్తే అడ్డుకోవాలని, వారి పై అధికారులకు ఫిర్యాదు చేయాలని రోజా కరోనా కేసుల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశారు.

  English summary
  APIIC chairman Roja Selvamani outraged on Telugu Desam Party chief Chandrababu Naidu as well as Lokesh . Roja, who is in the throes of Chandrababu and Nara Lokesh, with the recent arrests of TDP leaders, Chandrababu and Lokesh have not sleep and holding tension. Meanwhile, Roja has made controvercial comments on number about the rise of corona cases in AP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X