Naniకి కిరాణ వ్యాపారం బెస్ట్ - సినిమాలు వేస్ట్ : పరిశ్రమకే నష్టం- రోజా సంచలనం..!!
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంటోంది. సినీ పరిశ్రమ వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్లుగా రోజు రోజుకీ పరిస్థితి మారిపోతోంది. టిక్కెట్ల ధరల తగ్గింపు..థియేటర్ల మూసివేత వ్యవహారం పైన తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీసాయి. టిక్కెట్ల ధరలు తగ్గించటం అంటే ప్రేక్షకులను అవమానించటమేనని చెబుతూ... సినిమా థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా దుకాణం కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నామని వ్యాఖ్యానించారు.

హీరో నాని వ్యాఖ్యలపై వివాదం
దీని
పైన
ఇప్పటికే
మంత్రులు
అనిల్..బొత్సా..పేర్ని
నాని
సీరియస్
గా
రియాక్ట్
అయ్యారు.
దీంతో..నాని
తన
వ్యాఖ్యల
ఉద్దేశం
వేరని..వాటిని
ప్రజెంట్
చేసిన
విధానం
వేరని
చెప్పుకొచ్చారు.
ప్రముఖ
నిర్మాత
దిల్
రాజు
సైతం
నాని
వ్యాఖ్యల
పైన
వివాదం
చేయవద్దని
సూచించారు.
ఇదే
సమయంలో
మంత్రి
అనిల్
సినిమా
హీరోల
రెమ్యునరేషన్
భారీగా
ఉందని..అదే
70
శాతం
వరకు
సినిమా
నిర్మాణంలో
ఖర్చు
అవుతుందని
చెప్పుకొచ్చారు.
ఇప్పుడు
హీరో
నాని
వ్యాఖ్యల
పైన
సినీ
నటి..వైసీపీ
ఫైర్
బ్రాండ్..నగరి
ఎమ్మెల్యే
రోజా
స్పందించారు.

ఇలాంటి వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీకే నష్టం
పేదల మేలు కోసమే సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేసారు. పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్న వారు..చిన్న సినిమాల గురించి ఎందుకు ఆలోచన చేయరంటూ ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ల అంశం త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటికే దీని పైన నియమించిన కమిటీ అన్ని అంశాలు అధ్యయనం చేసి..పరిష్కార మార్గాలు సూచిస్తుందన్నారు. ఇక, హీరో నాని చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్యల కారణంగా సినిమా పరిశ్రమల మరింతా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు.

నాని సినిమాలు వద్దు... కిరాణా వ్యాపారమే బెస్ట్
సినిమా
థియేటర్ల
కంటే
కిరాణా
వ్యాపారం
బాగా
ఉందనే
అభిప్రాయం
ఉన్నప్పుడు,
ఇక
నానికి
సినిమాలు
ఎందుకు
చేయటం
వేస్టు..కిరాణా
వ్యాపారమే
చేసుకోవచ్చని
వ్యాఖ్యానించారు.
కొంత
మంది
రాజకీయ
నేతలు
తమ
ఉనికి
కోసం..
కొత్తగా
పార్టీలు
పెట్టిన
వారే
ఇలాంటి
వివాదాలకు...పరిస్థితికి
కారణమని
మండిపడ్డారు.
ఇటువంటి
వారి
నోటి
దురద
కారణంగానే
మా
ఎన్నికలు
సైతం
సాధారణ
ఎన్నికలను
తలపించే
తరహాలో
సాగాయన్నారు.
రాజకీయంగా
పార్టీ
ఏర్పాటు
చేసి..
సినిమాలు
తీస్తున్న
వ్యక్తి
ఈ
పరిస్థితి
కారణమంటూ
విమర్శించారు.
గతంలో
లేని
విధంగా
సినీ
ఇండస్ట్రీలో
ఎవరికి
తోచిన
విధంగా
వారు
మాడ్లాడుతుండటం
కారణంగానే
ఇలాంటి
పరిస్థితులు
ఏర్పుడుతన్నాయంటూ
రోజా
చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం
ఎప్పుడూ
చర్చలకు
సిద్దమేనని..
మంచి
ఉద్దేశంతో
ప్రభుత్వం
ముందుకు
వస్తే
అన్నీ
సమస్యలు
పరిష్కారం
అవుతాయని
రోజా
సూచించారు.