• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Roja బెర్తు ఖరారైందా :ఫైర్ బ్రాండ్ కూల్ స్టెప్స్ : అడ్డుపడినా..ఆగేనా..!!

By Lekhaka
|

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా..పార్టీ అధికారంలోకి వచ్చిన కూల్ గా కనిపిస్తున్నారు. గతంలో లాగా పొలిటికల్ ఫైర్ కనిపించటం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ వచ్చిన రోజా ఇప్పుడు మాత్రం తన పని వరే తాను అన్నట్లుగా మారిపోయారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఇప్పుడు రోజా కు మంత్రి పదవి పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2019 లో ఎన్నికల్లో గెలిచిన తరువాత మహిళా కోటాలో రోజాకు మంత్రి పదవి ఖాయమంటూ శాఖలు సైతం ప్రచారం జరిగాయి.

ఖాయం అనుకున్నా...అందకుండా

ఖాయం అనుకున్నా...అందకుండా


కానీ, అనూహ్యంగా జగన్ తన తొలి కేబినెట్ లో సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేయటంతో చిత్తూరు జిల్లా ఈక్వేషన్స లో రోజాకు స్థానం దక్కలేదు. రెడ్డి వర్గానికి చెందిన పెద్దిరెడ్డికి ఇవ్వటంతో..అదే వర్గానికి రెండో పదవి సాధ్యపడలేదని చెప్పుకొచ్చారు. దీంతో..మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రోజా హాజరు కాలేదు. ఆ తరువాత సీఎం జగన్ ను కలిసారు. ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చేసిన వేధింపులు..అసెంబ్లీలో సంవత్సరం పాటు బహిష్కరణ...వ్యక్తిగతంగా చేసిన దూషణల గురించి గుర్తు చేస్తూ వాపోయారు. ఆ సమయంలోనే మంత్రివర్గ రెండున్నారేళ్ల తరువాత జరుగుతుందని..ఆ సమయంలో ఖచ్చితంగా పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు రోజా సన్నిహితులు అప్పట్లోనే చెప్పుకొచ్చారు. ఇక, వెంటనే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి అప్పగించారు. దీంతో..రోజా శాంతించారు.

విస్తరణ సమయంలో పరిశీలిస్తానంటూ..

విస్తరణ సమయంలో పరిశీలిస్తానంటూ..

తనకు మంత్రి పదవ దక్కలేదనే బాధ లేదని చెప్పుకొచ్చారు. సామాజిక సమీకరణాలలో భాగంగానే తనకు మంత్రి పదవి రాలేదని వివరించారు. ఇక, ఇప్పుడు పూర్తిగా ఎన్నికల టీం ను జగన్ ను సెలెక్ట్ చేయబోతున్నారు. ప్రభుత్వ-పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారికి ప్రాధాన్యత దక్కనుంది. అయితే, చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత పెద్దిరెడ్డిని కేబినెట్ నుండి తప్పించే అవకాశాలు లేవు. మరో నేత డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామిని తప్పించినా...రెడ్డి వర్గానికి అదే జిల్లా నుండి అవకాశం కనిపించటం లేదు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సైతం సీనియర్ నేతగా..కేబినెట్ బెర్తు ఆశిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. విప్ గా..టీటీడీ బోర్డు సభ్యుడిగా..తుడా ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన సైతం పెద్దిరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 జిల్లాలో మారుతున్న సమీకరణాలు..

జిల్లాలో మారుతున్న సమీకరణాలు..


కుప్పం నియోజకవర్గానికి చెందిన బీసీకి ఈ సారి కేబినెట్ లో స్థానం ఇవ్వటం ద్వారా ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలనేది మరో ఆలోచనగా తెలుస్తోంది. అయితే, రోజాకు మంత్రి పదవి రాకుండా జిల్లాలోనే సొంత పార్టీలో ఒక బలమైన వర్గం ప్రయత్నిస్తోందనే వాదన ఉంది. అయితే, జగన్ హామీ ఇచ్చారని...ఖచ్చితంగా ఈ సారి మంత్రి పదవి వస్తుందని రోజా అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఉన్న ముగ్గురు మహిళల్లో ఇద్దరు ఎస్సీ..ఒకరు ఎస్టీ వర్గానికి చెందిన వారు. వారిని మార్పు చేసినా..తిరిగి బీసీ-ఎస్సీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లా నుండి రోజా ఒక్కరే మహిళా ఎమ్మెల్యేగా ఉన్నారు.

సీమ నుండి మహిళా మంత్రి..

సీమ నుండి మహిళా మంత్రి..

రాయలసీమ జిల్లాల నుండి మహిళలకు ప్రాధాన్యత లేకపోవటంతో..ఈ సారి విస్తరణలో అనంత పురం జిల్లా నుండి బీసీ మహిళకు కేబినెట్ లో స్థానం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లా మీద జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. జిల్లాలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరే టీడీపీ నుండి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే లక్ష్యంతో పని చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజవకర్గంలోనూ వైసీపీ ఆధిక్యత కొనసాగింది. ఇక, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డ కుటుంబం పైన సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న పీలేరు ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి సైతం పదవి ఆశిస్తున్నారు. ఆయనకు కేబినెట్ లో స్థానం లేకపోయినా..టీటీడీ బోర్డులో చాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

సర్దుబాటు చేస్తారా...పార్టీలో బాధ్యతలిస్తారా

సర్దుబాటు చేస్తారా...పార్టీలో బాధ్యతలిస్తారా


దీంతో..రోజా కు సర్దుబాటు చేసి మంత్రి పదవి ఇస్తారా.. లేక నామినేటెడ్ పదవిలోనే కొనసాగిస్తూ పార్టీలోనే మరింత కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇప్పుడు చర్చకు కారణమైంది. అయితే, తన నియోజక వర్గంలో మంత్రి నారాయణ స్వామి జోక్యం..జిల్లా అధికారులు తనకు కనీసం గౌరవం ఇవ్వటం లేదనే ఆవేదనతో ఉన్న రోజా...ఒక రకంగా నిరాశతో ఉన్నట్లు కనిపించారు. రోజాకు గుర్తింపు ఇవ్వకపోవటం ఏంటంటూ కార్యకర్తలు..అభిమానుల్లోనూ చర్చ సాగింది. రోజాకు ఈ సారి మంత్రి పదవి ఇవ్వకపోతే..పార్టీలోనే ప్రతికూల సంకేతాలు వస్తాయనే వాదనా ఉంది. దీంతో..ఫైర్ బ్రాండ్ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Suspense continues over YCp fire brand Roja on getting cabient berth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X