'భూమా చనిపోవడానికి 24గం. ముందు.. చంద్రబాబుతో తీవ్ర వాగ్వాదం'
నాగిరెడ్డి చనిపోవడానికి 24గం. ముందు చంద్రబాబుతో తీవ్ర వాగ్వాదం జరిగిందని తిప్పారెడ్డి ఆరోపించడం గమనార్హం.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి మృతిపై ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి వైసీపీ సభ్యులు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సభలోకి రాకపోయినా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు ప్రభుత్వాన్ని, సీఎంను ఉద్దేశించి పలు విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణానికి సీఎం చంద్రబాబు నుంచి ఎదురైన ఒత్తిడే ప్రధాన కారణమని, ఆ టార్చర్ భరించలేకే ఆయన హఠాన్మరణం చెందారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి పలువురు పార్టీ నాయకులతో కలిసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

భూమాను టీడీపీలో చేర్చుకునే సమయంలో మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ప్రలోభపెట్టారని ఆరోపించారు. తీరా ఏడాది గడిచిపోయినా భూమా నాగిరెడ్డికి పదవి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. నాగిరెడ్డి చనిపోవడానికి 24గం. ముందు చంద్రబాబుతో తీవ్ర వాగ్వాదం జరిగిందని తిప్పారెడ్డి ఆరోపించడం గమనార్హం.
ఆ వాగ్వాదం వల్లే భూమా తీవ్ర మనస్థాపం చెంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని సైతం టీడీపీ సభ్యులు రాజకీయం చేస్తున్నారని, భూమా మృతి విషయంలో చంద్రబాబే ముద్దాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications