వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే ఆస్తులున్నాయని నిరూపించు.... లోకేష్‌పై ఫైర్ అయిన వంశీ

|
Google Oneindia TeluguNews

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడడంపై టీడీపీ సీరియస్‌గా స్పందించిన విషయం తెలిసిందే.. దీంతో ఆయన పార్టీ మారుతున్నానని ప్రకటించిన మరునాడే నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. వంశీ తీరుపై చర్చించిన అనంతరం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్టీ నేతలతో పాటు వంశీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ముఖ్యంగా లోకేష్ , వంశీల మధ్య తీవ్ర దుమారం రేగుతోంది.

 ఆస్తులున్నాయని దమ్ముంటే నిరూపించూ...

ఆస్తులున్నాయని దమ్ముంటే నిరూపించూ...

ఈ నేపథ్యంలోనే ఆస్తులను కాపాడుకునేందుకే టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారడని ఆ పార్టీ కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వంశీ స్పందించాడు. తనకు ఉన్న ఆస్తులకు సంబంధించి ...దమ్ముంటే ఆధారాలతో సహా బయటపెట్టాలని వంశీ సవాల్ విసిరారు. లోకేష్ వలే తాను అక్రమ ఆస్తులు కూడ బెట్టలేదని అన్నారు. ఆయన లాగా జనం సొమ్ము తినాల్సిన అవసరం నాకు లేదని అన్నారు. ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నానని, ఆస్తుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఫైర్ లేని లోకేష్ తనపై ఫైర్ ఎంటని ఎద్దేవా చేశారు.

జూ. ఎన్టీఆర్ పేరు చెబితే లోకేష్‌కు వణుకు

జూ. ఎన్టీఆర్ పేరు చెబితే లోకేష్‌కు వణుకు

పార్టీ మారడంపై టీడీపీకి ఎలాంటీ నష్టం లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సైతం ఆయన ఘాటుగా స్పందించాడు. తాను పార్టీ మారడం వల్ల పార్టీకి నష్టం కాని, లోకేష్‌కు ఎలాంటీ నష్టం లేదని , ఆయనకు అన్ని సౌకర్యాలను చంద్రబాబు సంపాదించిపెట్టారని ఎద్దెవా చేశాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే... లోకేష్ వణుకు పుడుతుందని ,లోకేష్‌కు ఎన్టీఆర్ పేరు చెబితేనే...104 జ్వరం పట్టుకుంటుందని విమర్శించారు. లోకేష్‌కు, జూనియర్ ఎన్టీఆర్‌కు పొలిక లేదని అన్నారు.

రాజీనామాపై స్పందించిన వంశీ

రాజీనామాపై స్పందించిన వంశీ

పార్టీపై విమర్శలు చేసిన వంశీ రాజీనామా చేయాలని లోకేష్‌ డిమాండ్ చేశారు. దీంతో వంశీ కూడ అదే స్థాయిలో స్పందించారు. మొత్తం రెండువందల మందికి బీఫామ్స్ ఇస్తే ఎంతమంది గెలిచారని ప్రశ్నించారు. బీ ఫామ్ ఇవ్వడంతో అభ్యర్థులు గెలుస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు బీఫాం తీసుకున్న లోకేష్ ఎందుకు గెలువలేదని ప్రశ్నించారు. ఇక జగన్‌ను తిట్టి ఇప్పుడు ఆపార్టీలో చేరడంపై కూడ వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌పై ఎన్ని విమర్శలు చేశాడని, ఇటివల ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీని సైతం తీవ్రంగా విమర్శించారని అన్నారు. అవన్ని లోకేష్‌కు గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ రాసిచ్చిన స్క్రీప్టునే తాను చదివానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం జనన్‌ను తిట్టడడం తప్పేనని ఒప్పుకున్నారు.

నెల్లూరు పర్యటనలో వంశీపై ఫైర్ అయిన లోకేష్

నెల్లూరు పర్యటనలో వంశీపై ఫైర్ అయిన లోకేష్

కాగా ఉదయం నెల్లూరు జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ వంశీ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన తన ఆస్తులను కాపాడుకునేందుకే పార్టీ మారుతున్నాడని లోకేష్ దుయ్యబట్టాడు. వంశీ పార్టీ మారడం వల్ల టీడీపీకి ఎలాంటీ నష్టం లేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ వైఫల్యాలపై మాట్లాడిన వంశీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారం క్రితమే తనతో మాట్లాడిన వంశీ రాజకీయ లబ్ధికోసమే తనపై విమర్శలు చేస్తున్నాడని అన్నారు

English summary
Gannavaram MLA Vallabhaneni Vamsi has fired on TDP state secretary Lokesh. he gave conter attack of his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X